Alzheimers: ఒకే ఒక్క రక్త పరీక్ష.. అల్జీమర్స్ ఎప్పుడు వస్తుందో చెప్పేస్తుంది!

అల్జీమర్స్ ఎప్పుడు వస్తుందో చెప్పేస్తుంది!

Update: 2026-05-15 02:15 GMT

Alzheimers: అల్జీమర్స్‌.. మనిషి జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని నిశ్శబ్దంగా హరించే మెదడు వ్యాధి. ఈ జబ్బు ఏ వయసులో మొదలవుతుందో ముందే తెలిస్తే ఎంత బాగుంటుందో కదా? అదీ కేవలం ఒకే ఒక్క రక్త పరీక్షతో సాధ్యమైతే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ చేసిన తాజా అధ్యయనంలో ఇదే వెల్లడైంది. అల్జీమర్స్ లక్షణాలు భవిష్యత్తులో ఎప్పుడు కనిపిస్తాయో ముందే అంచనా వేసే అద్భుతమైన సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి రానుంది.

అసలు ఈ రక్త పరీక్ష ఎలా పనిచేస్తుంది? అల్జీమర్స్‌ బారినపడ్డవారి రక్తంలో పీ-టావ్‌217 (p-tau217) అనే ప్రొటీన్‌ పెద్ద మొత్తంలో ఉంటుంది. పరిశోధకులు వివిధ వయసుల వారి రక్త నమూనాలను సేకరించి, ఆ ప్రొటీన్ మోతాదులను విశ్లేషించి ఒక వినూత్నమైన ‘సమయ’ నమూనాను (Timing Model) రూపొందించారు. రక్తంలో ఈ ప్రొటీన్ స్థాయిలను బట్టి, ఆ వ్యక్తిలో అల్జీమర్స్ లక్షణాలు ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందో ఈ మోడల్ ఖచ్చితంగా అంచనా వేయగలదు.

పరిశోధనలో తేలిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రక్తంలో ఈ ప్రొటీన్ మోతాదులు ఎక్కువగా ఉన్న సమయానికి, లక్షణాలు మొదలయ్యే సమయానికి మధ్య వ్యత్యాసం వయసుతో పాటు మారుతూ వస్తోంది. ఉదాహరణకు, 60 ఏళ్ల వయసులో ఈ ప్రొటీన్‌ మోతాదులు ఎక్కువగా ఉన్నవారికి, సుమారు 20 ఏళ్ల తర్వాత అంటే 80 ఏళ్ల వయసులో లక్షణాలు ఆరంభమవుతున్నాయి. అదే 80 ఏళ్ల వయసులో ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్నవారికైతే, మరో 11 ఏళ్ల లోపే అంటే 91 ఏళ్ల వయసులో లక్షణాలు మొదలవుతున్నట్లు గుర్తించారు.

Tags:    

Similar News