Liver Problems Without Alcohol: మద్యం తాగే వారికి మాత్రమే కాలేయ సమస్యలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే! ఈ రోజుల్లో సిటీల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFLD). అవును, ఆల్కహాల్ అలవాటు లేకపోయినా మీ లివర్ ప్రమాదంలో పడవచ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే కాదు, డాక్టర్లు హెచ్చరిస్తున్న చేదు నిజం.

మన ఆధునిక జీవనశైలే దీనికి ప్రధాన శత్రువు. గంటల తరబడి కదలకుండా సీట్లలో కూర్చొని పని చేయడం.. అర్థరాత్రి వేళల్లో భారీ భోజనాలు చేయడం.. నూనెలో వేయించిన జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడటం వల్ల మన కాలేయంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోతోంది. మన శరీరం ఆ కొవ్వును కరిగించలేనప్పుడు, అది లివర్ పనితీరును నెమ్మదింపజేస్తుంది.

చాలామంది అనుకుంటారు.. "నేను సన్నగానే ఉన్నాను కదా, నాకెందుకు లివర్ ప్రాబ్లమ్ వస్తుంది?" అని. కానీ గుర్తుంచుకోండి, బరువు తక్కువగా ఉన్నా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ‘లీన్ ఫ్యాటీ లివర్’ (Lean Fatty Liver) అంటారు. కాబట్టి, మీ శరీరం బయటకి ఎలా కనిపిస్తోంది అన్నది ముఖ్యం కాదు, లోపల కాలేయం ఎంత ఆరోగ్యంగా ఉందన్నదే ముఖ్యం.

ముప్పు నుంచి తప్పించుకోవడం ఎలా?

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక: వ్యాయామం మీ లివర్‌లోని కొవ్వును కరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం: పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పంచదార ,జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.

క్రమం తప్పని నిద్ర: సమయానికి భోజనం, సరైన నిద్ర మీ కాలేయానికి విశ్రాంతినిస్తాయి.

Tags: