Monsoon Brings a Higher Risk of Stomach Infections: వానాకాలంలో పొంచి ఉన్న కడుపు ఇన్ఫెక్షన్ల ముప్పు.. డాక్టర్లు సూచిస్తున్న బెస్ట్ టిప్స్ ఇవే..

బెస్ట్ టిప్స్ ఇవే..

Update: 2026-07-16 11:20 GMT

Monsoon Brings a Higher Risk of Stomach Infections: వర్షాకాలం మొదలైందంటే చాలు వాతావరణం చల్లబడి ఉపశమనం లభించినప్పటికీ, మరోవైపు రకరకాల ఇన్ఫెక్షన్లు మరియు సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో కలుషితమైన ఆహారం, నీటి వల్ల వచ్చే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతాయి. వానాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయని, అందుకే ఆహార, నీటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్‌లో కడుపు ఇన్ఫెక్షన్లు, డయేరియా, వాంతులు, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి వైద్యులు సూచిస్తున్న కొన్ని కీలకమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి..

కాచి చల్లార్చిన నీటినే తాగండి

వానాకాలంలో నీటి ద్వారా వచ్చే వ్యాధులు చాలా ఎక్కువ. అందుకే పంపు నీటిని నేరుగా తాగకుండా, బాగా కాచి చల్లార్చిన నీటిని లేదా ఫిల్టర్ చేసిన సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు విడిగా దొరికే నీటి కంటే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వాడటం మంచిది.

వీధి ఆహారానికి దూరంగా ఉండండి

ఈ సీజన్‌లో బయట ఓపెన్‌గా ఉండే చాట్, పానీపూరి, కట్ చేసిన పండ్లు, రోడ్ సైడ్ దొరికే ఫుడ్‌ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ ఆహార పదార్థాలపై ఈగలు వాలడం వల్ల కలుషిత నీటిని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా వ్యాపిస్తాయి.

పండ్లు, కూరగాయలను బాగా కడగాలి

బజారు నుండి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను నేరుగా వాడకూడదు. వాటిని కాస్త ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాతే వంటకు ఉపయోగించాలి. ఆకుకూరల్లో ఈ సీజన్‌లో పురుగులు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వేడి వేడి ఆహారాన్నే తీసుకోండి

ఎప్పుడో వండిన ఆహారాన్ని లేదా నిల్వ ఉన్న పదార్థాలను తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. వండిన 1-2 గంటల లోపే వేడి వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. పచ్చి ఆహారాలు లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు వంటి వాటికి ఈ సీజన్‌లో దూరంగా ఉండాలి.

వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం

భోజనానికి ముందు, బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం ద్వారా క్రిములు శరీరంలోకి చేరకుండా కాపాడుకోవచ్చు.

నిపుణుల సూచన:

వానాకాలంలో రోగనిరోధక శక్తి కాపాడుకోవడం చాలా అవసరం. మీ ఆహారంలో అల్లం, వెల్లుల్లి, పసుపు, నిమ్మరసం వంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న పదార్థాలను చేర్చుకోండి. ఒకవేళ మీకు తరచుగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే అర్హత కలిగిన డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందడం మంచిది.

Tags:    

Similar News