Neem leaves: టూత్ బ్రెష్ కాదు.. వీటితో దంతాలు తోముకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఎన్ని లాభాలో తెలుసా..?
Neem leaves: ఆధునిక టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌ల వాడకం సర్వసాధారణం అయినప్పటికీ మన పూర్వీకులు ఉపయోగించిన సహజమైన వేప పుల్లల ప్రాముఖ్యత ఇంకా తగ్గలేదు. ఇవి దంతాలను శుభ్రపరచడమే కాకుండా వాటికి సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వేప పుల్లలను ఉపయోగిస్తున్నారు. వారి దంతాలు ఇప్పటికీ బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. వేప పుల్లలతో పళ్లు తోమడం వల్ల దంతాలు శుభ్రమవడంతో పాటు చిగుళ్లకు మంచి మసాజ్ లభిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. రసాయనాలతో కూడిన టూత్‌పేస్టుల వాడకం లేనప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు.
వేప పుల్లల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు
సహజ క్రిమినాశక శక్తి: వేప వంటి చేదు కర్రలలో సహజంగా యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వేప పుల్లను నమిలినప్పుడు దానిలోని ఫైబర్స్ దంతాల మధ్యలోకి చొచ్చుకుపోయి, ఇరుక్కున్న ఆహార పదార్థాలను, ఫలకాన్ని తొలగిస్తాయి.
చిగుళ్లను బలోపేతం చేయడం: వేప పుల్లను వాడటం వల్ల చిగుళ్ళు సున్నితంగా మసాజ్ అవుతాయి. ఇది రక్త ప్రసరణను పెంచి చిగుళ్లను బలోపేతం చేస్తుంది.
పసుపు రంగు తొలగింపు: వేప పుల్లను క్రమం తప్పకుండా వాడటం వల్ల దంతాలపై పేరుకున్న పసుపు రంగు తొలగిపోయి.. అవి తెల్లగా మెరుస్తాయి.
నోటి దుర్వాసన నివారణ: ఈ వేప పుల్లలు నోటి దుర్వాసనను సమర్థవంతంగా తొలగించి, నోటికి సహజసిద్ధమైన తాజాదనాన్ని అందిస్తాయి.
వేప పుల్లలను ఎలా ఉపయోగించాలి?
ఉదయం పూట వేప పుల్ల చివరను బాగా నమలండి. నమిలిన భాగం బ్రష్ లాగా మారిన తర్వాత దానిని మీ దంతాలపై సున్నితంగా రుద్దండి. అలాగే చిగుళ్లను కూడా మసాజ్ చేయండి. రోజుకు ఒక్కసారి ఇలా చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆధునిక దంత సంరక్షణ పద్ధతులతో పాటు ఈ సంప్రదాయ విధానాలను అనుసరించడం వల్ల నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.