Risk of Diabetes: ప్రతి ఇద్దరు ఉద్యోగులలో ఒకరికి మధుమేహం ముప్పు.. సర్వేలో వెల్లడైన షాకింగ్ నిజాలు..
సర్వేలో వెల్లడైన షాకింగ్ నిజాలు..
Risk of Diabetes: మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రారంభంలో దీని లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. చాలా మందికి తమ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం కూడా తెలియదు. ఒకవేళ దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే, అది క్రమంగా గుండె, మూత్రపిండాలు మరియు కళ్ళపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుంది.
ముప్పు పెరగడానికి ప్రధాన కారణాలు:
ఉద్యోగస్తులలో ఈ వ్యాధి వేగంగా ప్రబలడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన కారణాలను విశ్లేషించారు..
నిశ్చల జీవనశైలి:
గంటల తరబడి కుర్చీకే పరిమితమై పని చేయడం, వ్యాయామం లేకపోవడం.
పని ఒత్తిడి & స్క్రీన్ టైమ్: మితిమీరిన పని ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్/మొబైల్ స్క్రీన్ల ముందు గడపడం వల్ల ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది.
ఆహారపు అలవాట్లు..
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల అధిక బరువు (Obesity) పెరగడం.
పోషకాహార లోపం: ముఖ్యంగా విటమిన్ డి మరియు బి12 లోపాలు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.
ప్రమాదం నుండి బయటపడటం ఎలా?
యువ ఉద్యోగులు సైతం ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. అయితే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుండి తప్పించుకోవచ్చు..
శారీరక శ్రమ: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం తప్పనిసరి.
సరైన ఆహారం: తీపి పదార్థాలు, వేపుళ్లకు దూరంగా ఉండి సమతుల్య పోషకాహారం తీసుకోవాలి.
ఒత్తిడి నిర్వహణ: సరైన నిద్ర ఉండాలి. యోగా లేదా మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
రెగ్యులర్ చెకప్స్: 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా షుగర్ బీపీ పరీక్షలు చేయించుకోవాలి.