Pain Above the Eyes: కళ్ల పైన నొప్పికి కారణం ఏమిటి? ఇది మెదడు సమస్యకు సంకేతమా?

ఇది మెదడు సమస్యకు సంకేతమా?

Update: 2026-02-27 08:11 GMT

Pain Above the Eyes: నేటి డిజిటల్ యుగంలో కంటి నొప్పి అనేది సర్వసాధారణమైన సమస్యగా మారింది. అయితే చాలామంది దీనిని సాధారణ తలనొప్పిగా భావించి పెయిన్ కిల్లర్స్‌తో కాలం గడిపేస్తుంటారు. మరికొందరు ఆందోళనతో CT స్కాన్‌లు చేయించుకున్నా, రిపోర్టుల్లో ఏమీ తేలక అయోమయానికి గురవుతుంటారు. కంటి నొప్పి ఎప్పుడు ప్రమాదకరం? అది మెదడు సమస్యగా ఎప్పుడు మారుతుంది? అనే అంశాలపై వైద్యులు స్పష్టతనిస్తున్నారు.

కంటి నొప్పికి ప్రధాన కారణం ఏమిటి?

కళ్ళ పైన లేదా నుదిటి భాగంలో వచ్చే నొప్పికి ప్రధాన కారణం కంటి చూపులో మార్పులు రావడం. చూపు బలహీనపడినప్పుడు అద్దాల నంబరును మార్చకుండా పాతవే వాడటం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది.దీనివల్ల నుదిటి వరకు నొప్పి పాకడం, తలలో భారం, దృష్టి మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది కేవలం కంటికి సంబంధించిన సమస్య మాత్రమే.

మెదడు సంబంధిత సమస్య అని ఎలా గుర్తించాలి?

కేవలం కళ్ళలో మాత్రమే నొప్పి ఉంటే అది మెదడుకు సంబంధించిన సమస్య అయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ, కంటి నొప్పితో పాటు ఈ క్రింది లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలి:

వ్యాపించే నొప్పి: నొప్పి నుదిటి నుండి మెడ వెనుక భాగం వరకు పాకడం.

అకస్మాత్తు తిమ్మిర్లు: శరీరంలోని ఏదైనా భాగం అకస్మాత్తుగా మొద్దుబారడం.

వాంతులు - తల తిరగడం: పదేపదే వాంతులు అవ్వడం లేదా తీవ్రమైన మైకం రావడం.

ఈ లక్షణాలు ఉంటే అది మెదడులో వాపు లేదా కణితికి సంకేతం కావచ్చు. ఇలాంటి స్థితిలో ఆలస్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.

కంటి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు

మీ కళ్లను సురక్షితంగా ఉంచుకోవడానికి వైద్యులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు:

రెగ్యులర్ చెకప్: ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి.

స్క్రీన్ టైమ్ నియంత్రణ: మొబైల్ ఫోన్లు, టీవీలు మరియు లాప్‌టాప్‌ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.

సరైన ఆహారం: కంటి చూపును మెరుగుపరిచే విటమిన్-A కలిగిన పోషకాహారాన్ని తీసుకోవాలి.

Tags:    

Similar News