Pregnant Women Alert: గర్భిణీలు అలర్ట్: తొమ్మిది నెలలు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
తొమ్మిది నెలలు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Pregnant Women Alert: ప్రెగ్నెన్సీ అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఒక అద్భుతమైన మలుపు. అయితే ఈ టైంలో వారు ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎన్నో ఛాలెంజ్‌లను ఎదుర్కొంటారు. ముఖ్యంగా హార్మోన్ల ఇన్‌బాలెన్స్ వల్ల యాక్నె, దురద, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటి నుంచి రిలీఫ్ కోసం ఏ కెమికల్ ప్రొడక్ట్స్ పడితే అవి వాడటం అస్సలు సేఫ్ కాదు. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో చర్మాన్ని నేచురల్‌గా ఎలా కాపాడుకోవాలో.. డెర్మటాలజీ నిపుణులు చెబుతున్న బ్యూటీ రూటిన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
గర్భధారణ సమయంలో చర్మానికి రక్త సరఫరా పెరగడం వల్ల.. ముఖ్యంగా పొట్ట భాగంలో దురద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు గోళ్లతో గీకడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. అందుకే కెమికల్స్ బదులు కలబంద గుజ్జు, కొబ్బరి నూనె, లేదా బాదాం నూనెను పొట్టపై రాయాలి. ఇక చాలామందిని వేధించే పిగ్మెంటేషన్ లేదా నల్లటి మచ్చలను తగ్గించడానికి.. నిమ్మరసంలో కీరా జ్యూస్ కలిపి రాయడం, లేదా పచ్చి పాలలో పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. వారానికి రెండు సార్లు పూలు, పండ్లతో చేసిన నేచురల్ స్క్రబ్స్ వాడితే చర్మం ఎంతో మృదువుగా మారుతుంది.
ఈ టైంలో ఎండ తగిలితే ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగి మచ్చలు ఎక్కువవుతాయి. కాబట్టి రోజూ SPF-15 సన్ స్క్రీన్ వాడాలి. అయితే, మొదటి ఆరు వారాల్లో ఆక్సిబెంజోన్ వంటి కెమికల్స్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడకూడదు. ఒకవేళ డ్రై స్కిన్, పెదాల పగుళ్లు ఇబ్బంది పెడితే పాల మీగడ, గోధుమ గింజల నూనె అప్లై చేయాలి. అలాగే విటమిన్-సి సీరమ్ వాడటం వల్ల చర్మ కణాలు రిపేర్ అయ్యి గ్లో వస్తుంది. ఒకవేళ మొటిమలు ఎక్కువగా ఉంటే.. గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడొచ్చు, కానీ ఏది వాడినా ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల పాటు రెటినాల్, సాలిసిలిక్ ఆమ్లం, హైడ్రో క్వినోన్ ఉన్న ప్రొడక్ట్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. పర్ఫ్యూమ్స్, కెమికల్ సబ్బులు, నెయిల్ పాలిష్‌లు వాడొద్దు. అలాగే హెయిర్ స్ట్రైటనింగ్ జోలికి అస్సలు వెళ్లకండి. బిగుతు దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించండి.