Recommended Sleep Hours: ఏ వయసు వాళ్లు ఎన్ని గంటలు నిద్ర పోవాలి..

ఎన్ని గంటలు నిద్ర పోవాలి..;

Update: 2025-07-10 10:41 GMT

Recommended Sleep Hours: చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. సరిగా నిద్రపోలేక లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. కొందరు అతిగా కూడా నిద్రపోతారు. అయితే ఎన్నిగంటలు నిద్ర అవసరం. ఏ వయసు వాళ్లు ఎన్నిగంటలు నిద్రపోవాలో ఇపుడు మనం తెలుసుకుందాం.

అప్పుడే పుట్టిన పిల్లలతో పోల్చితే వయస్సు పెరిగే కొద్దీ నిద్ర సమయాలు తగ్గుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువులకు అంటే 3 నెలల వయసు వరకు రోజుకు 14-17 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అదే టీనేజర్లు (14-17ఏళ్లు) 8-10 గంటలు, యువకులు(18-25) 7-9 గంటలు నిద్రపోవాలని తెలియజేస్తున్నారు. అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు 7-8 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు.

నిద్ర తక్కువైతే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇన్ఫెక్షన్స్​కి త్వరగా అటాక్ అవుతారు. అది తగ్గడానికి చాలాకాలం పడుతుంది. దాంతోపాటు శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తక్కువ నిద్ర, హార్మోన్లను ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల ఆకలి వంటి ఫీలింగ్స్ కంట్రోల్​ అవుతాయి. గ్రోత్ హార్మోన్, టెస్టోస్టిరాన్​ హార్మోన్లు ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఇన్సులిన్ రిలీజ్​ అవ్వకుండా చేస్తుంది. కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. శరీర బరువులో మార్పులు వస్తాయి. టైప్​ –2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. స్ట్రెస్ హార్మోన్లు కూడా ఎఫెక్ట్ అవుతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఎందుకైనా మంచిది ఆరోగ్యంగా ఉండటం కోసం సరిపడా నిద్రపోవడం అలవాటు చేసుకోండి.

Tags:    

Similar News