Rising Brain Stroke Cases: యువతలో పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

Update: 2026-03-25 07:42 GMT

Rising Brain Stroke Cases:  ఒకప్పుడు పక్షవాతం అంటే కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే ఆరోగ్య సమస్య అని భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు, ఇటీవల కాలంలో యువతలో కూడా స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. సరైన జీవనశైలి లేకపోవడం, మితిమీరిన ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుంది?

మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం చిట్లి మెదడులో రక్తస్రావం జరగడాన్ని స్ట్రోక్ అంటారు. దీనివల్ల మెదడు కణాలు వేగంగా దెబ్బతింటాయి.

ప్రధాన కారణాలు:

అధిక రక్తపోటు, మధుమేహం.

అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం.

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు.

శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర మానసిక ఒత్తిడి.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే అది బ్రెయిన్ స్ట్రోక్ సంకేతం కావచ్చు..

ముఖం: నవ్వినప్పుడు ముఖం ఒకవైపుకు వాలిపోవడం లేదా పెదవులు ఒక పక్కకు లాగేయడం.

చేతులు - కాళ్లు: శరీరంలో ఒక భాగం అకస్మాత్తుగా మొద్దుబారడం లేదా బలహీనంగా అనిపించడం.

మాట: మాట్లాడటంలో ఇబ్బంది కలగడం, పదాలు తడబడటం.

దృష్టి: చూపు మసకబారడం లేదా ఒక వస్తువు ఇద్దరుగా కనిపించడం.

ఇతరాలు: తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడిచేటప్పుడు సమతుల్యత కోల్పోవడం.

తక్షణమే ఏం చేయాలి?

స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం విలువైనది. లక్షణాలు గుర్తించిన వెంటనే..

రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

రోగిని ప్రశాంతంగా పడుకోబెట్టి, తలను కొద్దిగా పైకి ఉంచాలి.

స్పృహ కోల్పోయే ప్రమాదం ఉన్నందున వారికి తినడానికి లేదా తాగడానికి ఏమీ ఇవ్వకూడదు.

నివారణ మార్గాలేంటి?

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం.

ఆహారంలో ఉప్పు, నూనె తగ్గించి.. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం.

బరువును అదుపులో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా మెడికల్ చెకప్స్ చేయించుకోవడం.

సకాలంలో స్పందించి వైద్య చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవడమే కాకుండా, శాశ్వత పక్షవాతం బారి నుండి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News