Avoid Bananas During Cold and Cough: జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు తినకూడదా?

అరటిపండు తినకూడదా?

Update: 2026-03-02 12:03 GMT

 Avoid Bananas During Cold and Cough: అరటిపండు.. అన్ని కాలాల్లోనూ, అతి తక్కువ ధరలో లభించే అద్భుతమైన పండు. అయితే దీని చుట్టూ ఎన్నో ఏళ్లుగా ఒక అపోహ ఉంది. జలుబు చేసినా దగ్గు వస్తున్నా "అరటిపండు తినకు.. కఫం పెరుగుతుంది అని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. మరి ఇది నిజమేనా? సైన్స్, ఆయుర్వేదం ఈ విషయంలో ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

వైద్య నిపుణులు ఏమంటున్నారు?

అరటిపండులో విటమిన్ B6, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

జలుబుకు కారణం కాదు: అరటిపండు తినడం వల్ల నేరుగా జలుబు వస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

దగ్గు ఉన్నప్పుడు జాగ్రత్త: ఒకవేళ మీకు ఇప్పటికే దగ్గు ఉంటే అరటిపండు తినడం వల్ల శరీరంలో కఫం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కానీ అది జలుబును తీవ్రతరం చేయదు.

మలబద్ధకం: మలబద్ధకం సమస్యతో బాధపడేవారు మాత్రం అరటిపండ్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆయుర్వేదం ఏ చెబుతోంది?

ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండు శరీరంలో కఫాన్ని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది.

శరీర తత్వం: చల్లని శరీర తత్వం ఉన్నవారు చలికాలంలో లేదా రాత్రి వేళల్లో అరటిపండు తింటే జలుబు, దగ్గు పెరుగుతున్నట్లు అనిపించవచ్చు.

సాధారణ స్థితి: సాధారణ శరీర తత్వం ఉన్నవారికి అరటిపండు వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వీటిని పరిమితంగా తీసుకోవడం మంచిది.

అరటిపండు వీరికి మంచిది కాదు..

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు అరటిపండుకు దూరంగా ఉండటం లేదా వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం:

అలెర్జీ రినిటిస్: ముక్కు దిబ్బడ, తుమ్ములు వంటి అలెర్జీ సమస్యలు ఉన్నవారు.

తీవ్రమైన కఫం: ఛాతీలో లేదా గొంతులో కఫం ఎక్కువగా పేరుకుపోయిన వారు.

గొంతు ఇన్ఫెక్షన్: టాన్సిల్స్ సమస్యలు లేదా గొంతు నొప్పి ఉన్నప్పుడు అరటిపండు తినడం వల్ల అసౌకర్యం కలగవచ్చు.

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ మీ శరీర తత్వాన్ని బట్టి, మీకు ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి దానిని ఎప్పుడు తినాలో నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా జలుబు ఉన్న సమయంలో రాత్రి పూట అరటిపండును నివారించడం మంచిది.

Tags:    

Similar News