Iron Deficiency in Women: మహిళల్లో ఈ లక్షణాలుంటే ఐరన్ లోపం ఉన్నట్టే..
ఐరన్ లోపం ఉన్నట్టే..
Iron Deficiency in Women: ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో 'ఐరన్ లోపం' లేదా రక్తహీనత ఒకటి. రోజంతా పనులతో బిజీగా ఉంటూ.. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? మీకు తరచుగా విపరీతమైన అలసట, నీరసంగా అనిపిస్తోందా? ఏ చిన్న పని చేసినా బలహీనత ఆవహిస్తుందా? కనీసం మెట్లు ఎక్కినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుందా? అయితే ఇవన్నీ మీ శరీరంలో ఐరన్ తక్కువగా ఉందనడానికి సంకేతాలు కావచ్చు. కేవలం ఇవే కాదు.. జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపం వల్ల కలిగే ప్రధాన ఇబ్బందే!
మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి? మందుల కంటే ముందు మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. నిపుణులు సూచిస్తున్న కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలు . ముఖ్యంగా పాలకూరను మీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోండి. రక్తాన్ని వృద్ధి చేయడంలో బీట్‌రూట్ కీలక పాత్ర పోషిస్తుంది.రోజూ పప్పు ధాన్యాలు, గుడ్లు మరియు మాంసం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ అందుతుంది.చిరుతిండిగా జంక్ ఫుడ్ కాకుండా.. బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజల వంటి విత్తనాలు (Seeds) తీసుకోవడం ఎంతో మేలు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి! మనం ఐరన్ ఉన్న ఆహారం తీసుకున్నా.. అది శరీరానికి సరిగ్గా అబ్బాలంటే విటమిన్-సి చాలా అవసరం. ఐరన్ శోషణను (Absorption) మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది. అందుకే మీ భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష లేదా స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవడం మర్చిపోకండి.