Clean Your Vegetables: కూరగాయల్ని ఇలా శుభ్రం చేసుకోండి...

ఇలా శుభ్రం చేసుకోండి...;

Update: 2025-07-02 05:08 GMT

Clean Your Vegetables: పండ్లు, కూరగాయలు పండించేటప్పుడు కొన్ని ఎరువులు, రసాయనాలు వాడటం సహజం. ఇవి కూడా పండ్ల పై పొరలో ఉండి పోతాయి. వీటిని నేరుగా తీసుకోవడం ద్వారా కూడా శరీరంలోకి కూడా రసాయనాలు వెళ్లిపోతాయి. సహజ సిద్ధంగా పండిన కూరగాయలు, పండ్లు ఆకర్షణీయంగా ఉండవు కానీ కృత్రిమంగా పండిన కూరగాయలు మెరుస్తూ ఉంటాయి. ఆ రంగును బట్టి గుర్తుపట్టేయొచ్చు. అయితే కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి..ఏం పద్దతులు ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం..

ఈ పద్దతులు పాటించండి

మనం తినే పండ్లు, కూరగాయలను గోరు వెచ్చని నీళ్లలోవేసి కడగడం వల్ల వాటిపై ఉండే రసాయనాలు పోతాయి. చల్లని నీళ్లతో కడిగినట్లయితే స్క్రబ్బర్ వాడాలి. దాంతో కూరగాయలను బాగా రుద్దాలి అలా చేస్తేనే వాటిపై ఉండే రసాయనాలు వదులుతాయి.

పండ్లు, కూరగాయల మీద చేరిన ఫెస్టిసైడ్స్ ను ప్రభావవంతంగా తగ్గించడంలో బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఒక బకెట్ లో నీళ్లు నింపి, అందులో ఒక నాలుగు చెంచాల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈనీళ్లలో పండ్లు, కూరగాయలు వేసి పావుగంట తర్వాత శుభ్రం చేసి తిరిగి మంచి నీళ్లతో కడిగి ఉపయోగించుకోవాలి.

పండ్లు, కూరగాయల మీద చేరిన క్రిములను, బ్యాక్టీరియాను వెనిగర్ కూడా నాశనం చేస్తుంది. ఒక బకెట్లో కొద్దిగా నీళ్లు నింపి అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేసుకోవాలి. ఆ నీళ్లలో ఐదు నిముషాలు పండ్లు, కూరగాయలు వేయడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు నాశనం అవుతాయి.

స్ప్రే సీసాలో ఒక చెంచా నిమ్మరసం, రెండు చెంచాల వెనిగర్, ఒక కప్పు నీళ్లు కలుపుకొని ఇంట్లోనే వెజిటబుల్ స్ప్రే తయారుచేసుకోవచ్చు. దీన్ని పండు లేదా కూరగాయల మీద చల్లి బలంగా రుద్ది తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చాలు.

Tags:    

Similar News