Suffering from Fatty Liver: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా? కంగారు పడకండి చేసుకునేందుకు వైద్యుల కీలక సూచనలు ఇవే..
వైద్యుల కీలక సూచనలు ఇవే..
Suffering from Fatty Liver: మారుతున్న ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల నేటి కాలంలో అనేకమందిని వేధిస్తున్న సమస్యలలో ఫ్యాటీ లివర్’ ఒకటి. లివర్‌లో సాధారణ పరిమితి కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇది కాలేయ వాపు, సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఫ్యాటీ లివర్ నిర్ధారణ కాగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రారంభ దశలోనే ఆహారం, దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు.
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సులభమైన చిట్కాలు..
పోషకాహారానికి ప్రాధాన్యత
ఆహారంలో చేర్చుకోవాల్సినవి
ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుదినుసులు, తాజా పండ్లు, నట్స్, నాణ్యమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.
నివారించాల్సినవి: నూనెలో వేయించిన పదార్థాలు, అధిక సంతృప్త కొవ్వులు, ఎక్కువ కేలరీలు ఉండే ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
. క్రమం తప్పకుండా వ్యాయామం
రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. నిరంతరం కూర్చుని పనిచేసే వారు ప్రతి గంటకోసారి లేచి కాసేపు అటూఇటూ నడవడం అలవాటు చేసుకోవాలి. ఇది బరువును అదుపులో ఉంచడంతో పాటు కాలేయంలోని కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది.
స్థిరమైన బరువు నియంత్రణ
అధిక బరువు ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే తొందరపడి క్రాష్ డైట్‌లు లేదా తీవ్రమైన నియమాలు పాటించకుండా, క్రమపద్ధతిలో సరైన పోషకాహారం మరియు శారీరక శ్రమతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలి.
చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు గుడ్‌బై
సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు, పేస్ట్రీలు వంటి అధిక చక్కెరలు ఉండే ఆహారాలను పూర్తిగా పరిమితం చేయాలి. ఆల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కేలరీలు పెరిగి శరీర మెటబాలిజం దెబ్బతింటుంది.
ఆల్కహాల్‌కు దూరం
మద్యం సేవించడం కాలేయంపై అదనపు భారాన్ని మోపుతుంది. ఫ్యాటీ లివర్ నిర్ధారణ అయిన వారు మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయడం లేదా వైద్యుల సూచన మేరకు నడుచుకోవడం శ్రేయస్కరం.
నాణ్యమైన నిద్ర, ఒత్తిడి నివారణ
నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి శరీర జీవక్రియలను దెబ్బతీస్తాయి. రోజూ రాత్రి 7–8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలను రోజువారీ జీవితంలో అలవర్చుకోవాలి.