The Secret to Turning Grey Hair Black: తెల్ల జుట్టును నల్లగా మార్చే సీక్రెట్.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..
ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..
The Secret to Turning Grey Hair Black: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు. జుట్టులో ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనిపించగానే చాలా మంది కంగారుగా వాటిని పీకేస్తుంటారు. అలా పీకడం వల్ల ఆ స్థానంలో మళ్లీ తెల్ల జుట్టు రాదని లేదా ఎక్కువ అవుతుందని రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అయితే తెల్ల జుట్టును పీకేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, పైగా అది జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెల్ల జుట్టును వదిలించుకోవడానికి రసాయన రంగులు వాడటం కంటే, ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో జుట్టును మళ్లీ నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హెన్నా - కాఫీ మిశ్రమం
జుట్టుకు రంగు వేయడంలో హెన్నా ఎంతో కాలంగా వాడుకలో ఉంది. దీనికి కాఫీ పొడిని జత చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
ఎలా వాడాలి?: ఒక కప్పు వేడి కాఫీ డికాషన్‌లో హెన్నా పౌడర్ కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత సాధారణ నీటితో కడిగేస్తే జుట్టుకు మంచి నలుపు రంగు వస్తుంది.
టీ డికాషన్‌తో మెరుపు
మనం రోజూ తాగే టీ పొడిలో ఉండే టానిక యాసిడ్ జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి సహాయపడుతుంది.
ఎలా వాడాలి?: టీ ఆకులను నీటిలో బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి చల్లార్చాలి. షాంపూ చేసుకున్న తర్వాత, ఈ టీ నీటితో జుట్టును కడగాలి. ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై మళ్లీ సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఉసిరి - శికాకాయ్
జుట్టు ఆరోగ్యానికి ఉసిరి మరియు శికాకాయ్ వంటి మరేదీ లేదని చెప్పవచ్చు. ఇవి జుట్టుకు పోషణనివ్వడమే కాకుండా తెల్ల జుట్టును నివారిస్తాయి.
ఎలా వాడాలి?: ఉసిరి పొడి, శికాకాయ్ పొడిని సమాన పరిమాణంలో తీసుకోండి. దీనిని నీరు లేదా పెరుగుతో కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.
గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు:
తెల్ల జుట్టును పీకడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి, కాబట్టి ఆ అలవాటు మానుకోండి.
రసాయనాలు ఎక్కువగా ఉండే హెయిర్ డైల కంటే ఈ సహజ పద్ధతులు జుట్టుకు మేలు చేస్తాయి.
సరైన ఆహారం, తగినంత నిద్ర కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.