Fruits: వర్షాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే..
తినాల్సిన పండ్లు ఇవే..;
Fruits: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ ఫీవర్స్ వస్తాయి. చాలా మంది ఏం తినాలన్నా ఆలోచిస్తారు. వర్షాకాలంలో మన శరీర రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. అలాగని పండ్లు తినడం మానేయడం కాదు. సరిగ్గా ఎంచుకుని తినాలి. ప్రధానంగా ఈ ఐదు రకాల పండ్లు.. ఆపిల్, పియర్,దానిమ్మ,రేగిపండ్లు, బొప్పాయి వర్షాకాలంతో తింటే బెటర్.
పండ్లు తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!
వర్షాకాలంలో ఏదైనా పండు తినే ముందు, దానిని నీటితో బాగా కడగాలి.
కట్ చేసిన పండ్లను ఎక్కువసేపు బయట పెట్టవద్దు.అలా ఉంచితే కూలింగ్ క్లైమేట్ కు వాటిలోబ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.
సీజన్ ఫ్రూట్స్ ను ఫ్రెష్ గా ఉండే వాటిని తినండి. ఎక్కువ నిల్వ ఉంచిన పండ్ల జోలికి అసలు వెళ్లవద్దు.
పండ్లు తినడం వల్ల అలెర్జీ .. కడుపు నొప్పి .. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అన్నిటికంటే ముఖ్యంగా పండ్లుకాని.. ఏ ఇతర పదార్థాలు తినేటప్పుడు చేతులను శుభ్రంగా వాష్ చేసుకోండి. మురికిచేతులతో అస్సలు ముట్టుకోవద్దు. మీ పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి.