Avoid a Hangover: హ్యాంగోవర్ కాకుండా ఇలా ట్రై చేయండి..
ఇలా ట్రై చేయండి..;
Avoid a Hangover: హ్యాంగోవర్ రాకుండా సేఫ్ గా ఉండేందుకు డాక్టర్లు కొన్ని అద్భుతమైన చిట్కాలు చెబుతున్నారు. ఎంప్టీ స్టమక్ తో.. అంటే ఖాళీ కడుపుతో ఎప్పుడూ మందు తాగొద్దని చెబుతున్నారు. హై న్యూట్రిషన్స్ ఉండే ఆహారం తీసుకున్నాక డ్రింకింగ్ మొదలుపెట్టడం సేఫ్ అంట.
ఓవర్ డ్రింక్ వలన వెంటనే డీహైడ్రేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి సింపుల్ టెక్నిక్.. ఎక్కువగా వాటర్ తాగటం. ప్రతి పెగ్గుకు మధ్య మధ్యలో వాటర్ తీసుకోవటం వలన హైడ్రేటెడ్ గా ఉంటారు. మందు ప్లస్ వాటర్ తాగటం వలన ఎక్కువ యూరినేషన్ జరుగుతుంది. దీని వలన పొటాషియం, సోడియం లవణాలు బ్లడ్ నుంచి యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతాయి. అలాంటప్పుడు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోవడం సేఫ్. అంటే కొబ్బరినీళ్లు, తక్కువ షుగర్ ఉండే స్పోర్ట్స్ డ్రింక్.. మధ్య మధ్యలో తాగటం బెటర్.
ఈ ఫుడ్ తీసుకోండి..
మల్టీ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం), క్వినోవా వంటి ఆహారాలు స్లో గా జీర్ణమవుతాయి.
ఎగ్స్, గ్రిల్ల్ డ్ చికెన్ (కాల్చిన చికెన్), ఇతర ప్రోటీన్ ఫుడ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండేలా చేస్తాయి.
ఆలివ్ ఆయిల్, అవకాడో, గుడ్ ఫ్యాట్స్.. బ్లడ్ ఆల్కహాల్ ను స్లోగా గ్రహించేలా చేస్తాయి.