Vitamin B6: మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, మూడ్‌ను సరిగా నియంత్రించడంలో విటమిన్ బి6 (పైరిడాక్సిన్) కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ప్రోటీన్లను సరిగా గ్రహించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఆధునిక జీవనశైలిలో స్ట్రెస్ పెరుగుతున్న నేపథ్యంలో విటమిన్ బి6 లోపం రాకుండా జాగ్రత్తపడాలి. దీని కోసం సహజ ఆహారాలను రోజువారీ డైట్లో చేర్చుకోవడం ఉత్తమం.
క్యారెట్లలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఫైబర్‌తో పాటు కళ్ల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ కూడా లభిస్తుంది. రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల బి6తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
పాలకూరలో విటమిన్ బి6తో పాటు ఐరన్, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. చలికాలంలో రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్లు కూడా బి6 యొక్క మంచి మూలం. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్లు తీసుకుంటే లోపం రాదు.
పచ్చి బఠాణీలు, క్యాలీఫ్లవర్, వాల్నట్స్, అవకాడో, పొద్దుతిరుగుడు గింజల నూనెలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని సలాడ్స్‌లో లేదా వంటల్లో చేర్చుకోవచ్చు. టొమాటోలో బి6తో పాటు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల చర్మం తాజాగా, మెరిసేలా ఉంటుంది.
కీరదోస, బీన్స్, శెనగలు, చేపలు, పుదీనా, స్వీట్ పొటాటో, కార్న్, పాలు, చికెన్ లివర్ వంటివి కూడా విటమిన్ బి6ను అందిస్తాయి. పుదీనాను జ్యూస్‌గా లేదా కూరల్లో వేసుకుంటే అదనపు విటమిన్లు కూడా లభిస్తాయి. బీన్స్‌లోని జింక్, కాపర్, సెలీనియం వంటివి మూడ్ స్వింగ్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
రోజువారీ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోవడం వల్ల విటమిన్ బి6 లోపం రాకుండా చూసుకోవచ్చు. స్ట్రెస్ తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. హార్మోన్ల బ్యాలెన్స్ కూడా మెరుగవుతుంది. అయితే అధిక మోతాదులో సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే సహజ ఆహారం ద్వారా తీసుకోవడమే మంచిది.
ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అవసరమైతే సప్లిమెంట్స్ వాడవచ్చు. రోజువారీ డైట్లో వైవిధ్యం ఉంచి పైన పేర్కొన్న ఆహారాలను చేర్చుకుంటే శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. స్ట్రెస్‌ను నియంత్రించి ఉత్సాహంగా జీవించాలంటే విటమిన్ బి6ను నిర్లక్ష్యం చేయకండి.