Walking Daily During Pregnancy: గర్భధారణ కాలం ప్రతీ మహిళ జీవితంలోనూ ఎంతో కీలకమైనది. ఈ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం వంటివి సాధారణం. అందుకే సరైన పోషకాహారంతో పాటు తేలికపాటి వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. వైద్యులు ఎలాంటి పరిమితులు విధించకపోతే, సాధారణ గర్భధారణ ఉన్నవారు ప్రతిరోజూ కొంత సమయం వాకింగ్ చేయడం వల్ల తల్లికి, బిడ్డకు ఎన్నో లాభాలు చేకూరతాయని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ స్పష్టం చేస్తోంది.

వాకింగ్ వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలు..

శరీరం ఉత్తేజంగా ఉంటుంది:

రోజూ వాకింగ్ చేయడం వల్ల కండరాలు చురుగ్గా మారతాయి. శరీరంలో శక్తి స్థాయిలు పెరిగి, దైనందిన పనులను సులభంగా చేసుకోగలుగుతారు.

గర్భధారణ సమయపు మధుమేహం కంట్రోల్:

నడక వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది గర్భధారణ సమయంలో వచ్చే ప్లాస్మా షుగర్, డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

అధిక బరువుకు చెక్:

ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం సహజమే అయినప్పటికీ, అవసరానికి మించి బరువు పెరిగితే బిపి , మధుమేహం మరియు ప్రసవ సమయంలో సమస్యలు వస్తాయి. వాకింగ్ ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

వెన్నునొప్పి, ఒంటినొప్పుల నుంచి ఉపశమనం:

గర్భధారణ సమయంలో నడుము నొప్పి, కాళ్ళలో బరువుగా అనిపించడం సాధారణం. క్రమం తప్పకుండా నడవటం వల్ల కండరాలు, కీళ్ళు చురుగ్గా మారి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

సుఖ ప్రసవానికి సిద్ధం చేస్తుంది:

రోజూ నడవడం వల్ల శరీర స్టామినా పెరుగుతుంది. ఇది నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలను మెరుగుపరుస్తుంది.

ఎవరు వాకింగ్ చేసేముందు డాక్టర్ సలహా తీసుకోవాలి?

కింది సమస్యలు ఉన్నవారు సొంతంగా వాకింగ్ ప్రారంభించకూడదు..

అధిక రక్తపోటు

తీవ్రమైన రక్తహీనత

గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు

తరచూ రక్తస్రావం కావడం*

నెలకు ముందే ప్రసవమయ్యే ప్రమాదం ఉన్నవారు

ప్లాసెంటాసంబంధిత సమస్యలు లేదా కవల పిల్లలు ఉన్నవారు

వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

సౌకర్యవంతమైన దుస్తులు, మంచి గ్రిప్ ఉన్న షూస్ ధరించాలి.

ప్రారంభంలో 15–20 నిమిషాలు మాత్రమే నడవాలి. ఆ తర్వాత డాక్టర్ సలహాతో 30 నిమిషాల వరకు పెంచుకోవచ్చు.

మరీ వేగంగా కాకుండా తేలికపాటి వేగంతో నడవాలి.

వాకింగ్ చేయడానికి ముందు, చేసిన తర్వాత తగినంత నీరు తాగాలి.

ఎండ తీవ్రంగా ఉండే సమయంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడవడం శ్రేయస్కరం.

ఎప్పుడు వెంటనే వాకింగ్ ఆపేయాలి?

నడిచే సమయంలో తల తిరగడం, కడుపు లేదా వెన్నులో తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తస్రావం, పనీర్ వాటర్ కారడం లేదా గుండెల్లో అసౌకర్యం అనిపిస్తే వెంటనే నడక ఆపి డాక్టర్‌ను సంప్రదించాలి.

Tags: