Want Black Hair: జుట్టు నల్లగా ఉండాలంటే ఏం చేయాలి.?
ఏం చేయాలి.?;
Want Black Hair: నిజానికి వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడుతుంటుంది. అలాంటప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. కానీ, కొన్నిసార్లు వయసుతో సంబంధం లేకుండానే జుట్టు తెల్లబడుతుంది. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొందరికి జెనెటికల్ గా జుట్టు తెల్లబడుతుంది..
జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇతర కారణాలతో మార్పులు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. మెలనిన్ పెంచుకోవడానికి క్యారెట్, నల్ల నువ్వులు, వాల్నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, మసూరి పప్పు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నువ్వుల నూనె, మెంతుల పొడి కలిపి తలకు మసాజ్ చేసి... అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు నల్లబడుతుంది.
జుట్టుకు నల్ల రంగును తెచ్చే మెలనిస్ తలలోని చర్మం కింది భాగంలో, వెంట్రుకల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపురంగులో కనిపిస్తుంది. అంటే తెలుపు అనేది రంగు కాదు. ప్రతీ వెంట్రుక ట్రాన్సఫరెంట్ గా ఉంటుంది.. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. మెలనిన్ లేకపోతే వెంట్రుక తెలుపుగా కనిపిస్తుందంతే.