Weekly Steam Therapy for Glowing Skin: వారానికోసారి ఆవిరితో మెరిసే చర్మం
ఆవిరితో మెరిసే చర్మం
Weekly Steam Therapy for Glowing Skin: మెరిసే ముఖం యవ్వనంగా కనిపించే చర్మం.. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? దీని కోసం ఖరీదైన క్రీములు అవసరం లేదు, ఇంట్లోనే వారానికోసారి ముఖానికి ఆవిరి పట్టిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీనివల్ల ముఖంపై పేరుకుపోయిన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మరియు మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. ఫలితంగా మొటిమల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, ఆవిరి పట్టడం వల్ల ముఖంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మంలో కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచి, మీ చర్మాన్ని మరింత బిగుతుగా, యవ్వనంగా మారుస్తుంది.
అయితే ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. ముఖానికి ఎక్కువ సేపు ఆవిరి పట్టడం అస్సలు మంచిది కాదు. అలా చేయడం వల్ల చర్మంలో ఉండే సహజ సిద్ధమైన నూనెలు తగ్గిపోయి, ముఖం పొడిబారిపోయే ప్రమాదం ఉంది. ఇది క్రమంగా ముడతలకు దారితీస్తుంది.కాబట్టి వారానికి ఒక్కసారి మాత్రమే.. అది కూడా తక్కువ సమయం ఆవిరి పట్టి మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి. సహజ సిద్ధమైన పద్ధతులతోనే మెరిసే మోమును మీ సొంతం చేసుకోండి!