Eat Tomatoes Every Day: రోజూ టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

తెలుసా?

Update: 2026-06-25 01:47 GMT

Eat Tomatoes Every Day: మన వంటగదిలో ప్రతిరోజూ కనిపించే కూరగాయల్లో టమాటా ఒకటి. కేవలం రుచి కోసమే కాకుండా, మన ఆరోగ్యానికి టమాటా చేసే మేలు అంతా ఇంతా కాదు. అసలు రోజూ టమాటా తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటాల్లో 'లైకోపీన్' (Lycopene) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది టమాటాకు ఎరుపు రంగును ఇవ్వడమే కాకుండా, మన గుండెను పదిలంగా ఉంచుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా ఇది కాపాడుతుంది. అంతేకాదు, శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకోవడంలో కూడా లైకోపీన్ కీలక పాత్ర పోషిస్తుంది.

టమాటాల్లో విటమిన్-ఎ, విటమిన్-సి , బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. రోజూ టమాటా ముక్కలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. రేచీకటి వంటి సమస్యలు దరిచేరవు. అలాగే, ఇందులో ఉండే విటమిన్-సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది.

మీకు జీర్ణ సమస్యలు ఉంటే టమాటా మీకు మంచి ఔషధం. ఇందులో ఉండే ఫైబర్ (పీచుపదార్థం. నీటి శాతం మలబద్ధకాన్ని నివారించి, జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. ఇక సౌందర్యం విషయానికి వస్తే... టమాటా రసం చర్మానికి సహజమైన గ్లో ని ఇస్తుంది. ఎండవల్ల వచ్చే ట్యాన్‌ను తొలగించి, చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునే వారికి టమాటా ఒక సూపర్ ఫుడ్. కూరల్లోనే కాదు, సలాడ్స్ రూపంలో లేదా సూప్ రూపంలో టమాటాను క్రమం తప్పకుండా తీసుకోండి...

Tags:    

Similar News