Eat Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తినడానికి ఏ టైమ్ బెస్ట్ ?

ఏ టైమ్ బెస్ట్ ?

Update: 2026-03-16 05:54 GMT

Eat Dry Fruits: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దానిని ఏ సమయంలో తీసుకుంటున్నామన్నది కూడా అంతే ముఖ్యం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం రోజూ తినే డ్రై ఫ్రూట్స్ విషయంలో సరైన సమయాన్ని పాటించడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రిచా దోషి ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా డ్రై ఫ్రూట్స్ తినడానికి ఏ సమయం ఉత్తమమో వివరించారు. ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు.

సాధారణంగా చాలామంది బాదం పప్పులను ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు, కానీ వీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అదేవిధంగా జీడిపప్పును మధ్యాహ్నం సమయంలో స్నాక్స్‌లా తీసుకోవడం వల్ల అందులోని మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి నిలకడైన శక్తిని ఇస్తాయి. అయితే జీడిపప్పులో కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని రాత్రి పూట తింటే జీర్ణం కావడానికి సమయం పడుతుంది, కాబట్టి పగటిపూట తీసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు పిస్తా పప్పులను పగటిపూట తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్ అందుతాయి. ఇక వాల్‌నట్స్ అంటే అక్రోట్ల విషయానికి వస్తే, వీటిని సాయంత్రం వేళల్లో తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల శోషణ బాగుంటుంది. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెలటోనిన్ అనే హార్మోన్ మనసును ప్రశాంతంగా ఉంచి రాత్రిపూట మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. సరైన సమయంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా అనవసరమైన ఆకలి తగ్గడమే కాకుండా మన ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News