Pregnancy Test: ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎపుడు చేసుకోవాలి.?
ఎపుడు చేసుకోవాలి.?
Pregnancy Test: గర్భధారణ పరీక్ష (Pregnancy Test) ఎప్పుడు చేసుకోవాలి .అయితే గర్భం ధరించిన విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే బిడ్డకు అంత మంచిదంటున్నారు నిపుణులు. చాలామంది నెలసరి మిస్సవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అప్పుడు గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్ రావచ్చు. నెలసరి మిస్సయిన వారానికి టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ అయినా ఒక్కోసారి కొంతమందిలో నెగెటివ్ వస్తుంటుంది.
1. పీరియడ్ మిస్ అయిన తర్వాత
మీకు పీరియడ్ రావాల్సిన తేదీ దాటిన వారం తర్వాత పరీక్ష చేసుకుంటే ఫలితం 99% ఖచ్చితంగా ఉంటుంది. మీ పీరియడ్స్ క్రమంగా (Regular) వస్తుంటే, మిస్ అయిన మరుసటి రోజే టెస్ట్ చేసుకోవచ్చు.
2. పీరియడ్స్ క్రమంగా లేకపోతే
ఒకవేళ మీ పీరియడ్స్ వచ్చే తేదీ కరెక్ట్‌గా తెలియనప్పుడు, మీరు శారీరకంగా కలిసిన తేదీ నుండి 21 రోజుల తర్వాత పరీక్ష చేసుకుంటే సరైన ఫలితం వస్తుంది.
3. పీరియడ్ రావడానికి ముందే చేసుకోవచ్చా?
కొన్ని కిట్లు పీరియడ్ రావడానికి 4-5 రోజుల ముందే ఫలితాన్ని చూపిస్తాయి. కానీ, అప్పుడు శరీరంలో గర్భధారణ హార్మోన్ (hCG) తక్కువగా ఉండటం వల్ల నెగటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పీరియడ్ మిస్ అయ్యే వరకు ఆగడం మంచిది.
పరీక్ష చేసుకునేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు:
ఉదయాన్నే నిద్రలేవగానే వచ్చే మొదటి మూత్రంతో టెస్ట్ చేయడం వల్ల hCG హార్మోన్ గాఢత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రిజల్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
టెస్ట్ చేసుకునే ముందు ఎక్కువగా నీళ్లు తాగితే మూత్రం పల్చబడి రిజల్ట్ తప్పుగా వచ్చే అవకాశం ఉంది.
మీరు కొన్న ప్రెగ్నెన్సీ కిట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదివి, ఎన్ని నిమిషాల తర్వాత ఫలితాన్ని చూడాలో గమనించండి.
మీకు టెస్టులో నెగటివ్ వచ్చి, ఇంకా పీరియడ్ రాకపోతే.. మరో 2-3 రోజులు ఆగి మళ్ళీ పరీక్ష చేసుకోండి. అప్పటికీ పీరియడ్ రాకపోతే డాక్టరును సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.