Benefits of Reverse Walking: రివర్స్ వాకింగ్ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
వాకింగ్ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Benefits of Reverse Walking: రోజూ నడవడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో రివర్స్ వాకింగ్ బాగా పాపులర్ అవుతోంది. ఇది సరదా కోసం చేసే వ్యాయామం మాత్రమే కాదు.. దీనికి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెనుకకు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
కండరాలను బలోపేతం చేస్తుంది: సాధారణ నడకతో పోలిస్తే రివర్స్ వాకింగ్ కండరాలను మరింత చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ఈ వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏకాగ్రతను పెంచుతుంది: వెనుకకు నడవడానికి ఎక్కువ శ్రద్ధ అవసరం. ఈ వ్యాయామం ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. పడిపోయే భయాన్ని తగ్గించి, మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. ఇది విద్యార్థులకు కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇది ప్రజలను మానసికంగా బలంగా చేస్తుంది.
గుండె ఆరోగ్యం - బరువు నియంత్రణ: ముందుకు నడవడం కంటే వెనుకకు నడవడం వల్ల గుండె స్పందన రేటు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వేగంగా కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మీ సాధారణ నడకకు అదనంగా, రివర్స్ వాకింగ్‌ను కూడా కొద్దిసేపు ప్రయత్నించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.