5 Mistakes Right After a Bath: స్నానం చేసిన వెంటనే ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం..
మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం..
5 Mistakes Right After a Bath: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లని వారు కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలామంది రోజుకు రెండు, మూడు సార్లు స్నానం చేస్తుంటారు. అయితే స్నానం చేయడం ఎంత ముఖ్యమో.. స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలను పాటించడం కూడా అంతే ముఖ్యం.
స్నానం ముగించిన వెంటనే చాలామంది తెలిసి గానీ, తెలియక గానీ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణలో హఠాత్తుగా మార్పులు వచ్చి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానం చేసిన వెంటనే అస్సలు చేయకూడని ఆ 5 తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వెంటనే ఏసీ లేదా ఫ్యాన్ కింద కూర్చోవడం. స్నానం చేసిన వెంటనే శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే కొద్దిగా తగ్గుతుంది. ఆ సమయంలో వేడి ఎక్కువగా ఉందని వెంటనే ఏసీ లేదా హై-స్పీడ్ ఫ్యాన్ ముందు కూర్చోకూడదు. ఇలా చేయడం వల్ల హఠాత్తుగా బాడీ టెంపరేచర్ మారి జలుబు, దగ్గు, తీవ్రమైన తలనొప్పి లేదా ఒళ్ళు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. ముందుగా శరీరాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతకు తీసుకురావడం మంచిది.
బరువైన భోజనం లేదా అల్పాహారం తినడం..
స్నానం చేసేటప్పుడు శరీరంలోని చర్మానికి, పైభాగాలకు రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. ఆ వెంటనే బరువైన ఆహారం తింటే, జీర్ణక్రియకు అందాల్సిన రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఫలితంగా అజీర్ణం, కడుపు నొప్పి రావచ్చు. అందుకే స్నానానికి, భోజనానికి మధ్య కనీసం 20 నుండి 30 నిమిషాల విరామం ఉండేలా చూసుకోవాలి.
తడి జుట్టుతోనే నిద్రపోవడం:
ముఖ్యంగా రాత్రి పూట స్నానం చేసే అలవాటు ఉన్నవారు.. జుట్టును సరిగ్గా ఆరబెట్టుకోకుండానే పడుకుంటారు. తడి జుట్టులో తేమ ఎక్కువ సేపు ఉండటం వల్ల స్కాల్ప్‌పై ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది తీవ్రమైన తలనొప్పికి, జుట్టు విపరీతంగా రాలిపోవడానికి కారణమవుతుంది.
చర్మ రంధ్రాలు తెరుచుకునే సమయం - జాగ్రత్త!
స్నానం చేసిన వెంటనే చర్మ రంధ్రాలు తెరుచుకుని ఉంటాయి. అటువంటి సమయంలో వెంటనే తీవ్రమైన సూర్యరశ్మికి లేదా వేడి గాలికి గురికావడం వల్ల చర్మంపై చికాకు, రాషెస్ లేదా స్కిన్ నల్లబడటం వంటి సమస్యలు వస్తాయి. బయటకు వెళ్లాల్సి వస్తే, శరీరాన్ని బాగా తుడుచుకుని, కొద్దిసేపు ఆగిన తర్వాతే వెళ్లాలి.
టవల్‌తో శరీరాన్ని గట్టిగా రుద్దడం:
స్నానం కాగానే చాలామంది టవల్‌తో చర్మాన్ని వేగంగా, గట్టిగా రుద్దుతుంటారు. దీనివల్ల చర్మంలోని సహజ తేమ పోయి స్కిన్ పొడిబారడం , పొలుసులుగా మారడం జరుగుతుంది. చర్మాన్ని టవల్‌తో మెల్లగా తుడుచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.
వెంటనే వ్యాయామం చేయడం:
స్నానం చేసిన తర్వాత మన శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. ఆ వెంటనే వర్కవుట్స్ లేదా భారీ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా వేడి నీటి స్నానం చేసిన వెంటనే వ్యాయామం చేస్తే నీరసం రావడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.