Cucumber: వేసవిలో మీ బాడీని కూల్‌గా ఉంచే దోసకాయ.. వీటితో తింటే డబుల్ బెనిఫిట్స్

వీటితో తింటే డబుల్ బెనిఫిట్స్

Update: 2026-04-16 10:40 GMT

Cucumber: భానుడి భగభగలకు బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే దోసకాయను మించిన మేటి ఆహారం లేదు. ఇందులో కేలరీలు తక్కువ, నీటి శాతం మరియు పోషకాలు ఎక్కువ. USDA నివేదిక ప్రకారం.. దోసకాయలో కాల్షియం, పొటాషియం, విటమిన్ సి, కె, మెగ్నీషియం వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే దోసకాయను ఒంటరిగా తినడం కంటే కొన్ని ఇతర ఆహారాలతో కలిపి తీసుకుంటే దాని శక్తి మరింత పెరుగుతుంది. ఆ అద్భుతమైన వేసవి కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

దోసకాయ - పెరుగు

దోసకాయ, పెరుగు కలయిక రుచికరంగా ఉండటమే కాకుండా కడుపుకు ఎంతో హాయినిస్తుంది. దోసకాయను తురిమి పెరుగులో కలిపి రైతాలా తీసుకోవచ్చు. దీనికి కొంచెం నల్ల ఉప్పు, మిరియాల పొడి జోడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మొలకలు - దోసకాయ

బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. మొలకెత్తిన ధాన్యాలకు దోసకాయ ముక్కలను జోడించడం వల్ల రుచితో పాటు ఫైబర్ కూడా అందుతుంది. మొలకలలో దోసకాయ, టమోటా, పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం కలిపి హెల్తీ సలాడ్ తయారు చేసుకోండి. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

రిఫ్రెష్‌ దోసకాయ - నిమ్మకాయ డ్రింక్

వేసవి మధ్యాహ్నాల్లో చల్లని పానీయం కావాలనుకుంటే దోసకాయ-నిమ్మరసం మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బ్లెండర్‌లో దోసకాయ ముక్కలు, నిమ్మరసం, నీరు వేసి మిక్సీ పట్టి వడకట్టండి. ఇది శరీరం నుండి విషపదార్థాలను తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మసాలా దోసకాయ - మజ్జిగ

మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్ గుణాలు, దోసకాయలోని విటమిన్లతో కలిస్తే అదొక పవర్‌ఫుల్ డ్రింక్‌గా మారుతుంది. మజ్జిగలో దోసకాయ ముక్కలు, జీలకర్ర పొడి, పుదీనా, నల్ల ఉప్పు కలిపి తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలో నీటి స్థాయిని కాపాడటంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.

ఎముకల ఆరోగ్యం నుండి చర్మ సౌందర్యం వరకు దోసకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ వేసవిలో పైన చెప్పిన కాంబినేషన్లతో దోసకాయను మీ డైట్‌లో చేర్చుకుని ఎండ వేడి నుండి మీ శరీరాన్ని రక్షించుకోండి.

Tags:    

Similar News