Afternoon Napping Increase Death Risk: మధ్యాహ్నం కునుకు తీస్తే మరణం ముప్పు తప్పదా? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు!

తాజా అధ్యయనంలో సంచలన విషయాలు!

Update: 2026-05-07 07:33 GMT

Afternoon Napping Increase Death Risk: మధ్యాహ్నం భోజనం చేశాక అలా కాసేపు కళ్లు మూసుకుని నడుం వాల్చడం మనలో చాలామందికి అలవాటు. దీనివల్ల బడలిక తగ్గి కొత్త ఉత్సాహం వస్తుందని అనుకుంటాం. కానీ, ఈ అలవాటే ప్రాణాంతకమని తెలిస్తే మీరు షాక్ అవుతారు! అవును.. పగటిపూట అతిగా కునుకు తీస్తే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

రష్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 55 ఏళ్లు పైబడిన వెయ్యికి పైగా మందిని సుమారు 8 ఏళ్ల పాటు నిశితంగా గమనించారు. వారి కదలికలు, విశ్రాంతి తీరుతెన్నులను విశ్లేషించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పగటిపూట ఎక్కువసేపు లేదా తరచూ కునుకు తీసేవారిలో మరణం ముప్పు పెరుగుతున్నట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు.

ఈ అధ్యయనం ప్రకారం.. పగటిపూట మీరు తీసే ప్రతి గంట కునుకుతో మరణించే ప్రమాదం సుమారు 13 శాతం పెరుగుతుంది. ఒకసారి కంటే ఎక్కువసార్లు కునుకు తీసేవారిలో, ప్రతి అదనపు కునుకుతో ముప్పు మరో 7 శాతం ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో నిద్రపోవడం మరింత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగటి నిద్ర అనేది మన శరీరంలో తెలియకుండానే దాగి ఉన్న ఇతర అనారోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చని వారు అనుమానిస్తున్నారు.

ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో విపరీతమైన నిస్సత్తువ, నీరసం వస్తున్నాయంటే దాని వెనుక ఏదో ఒక గంభీరమైన ఆరోగ్య సమస్య ఉండవచ్చు. ఇదే చివరికి మరణం ముప్పు పెరిగేలా చేస్తోంది. కాబట్టి, మీకు ఇటీవల బడలిక లేదా కునుకు తీసే అలవాటు ఎక్కువగా అనిపిస్తుంటే.. దానిని కేవలం అలసట అనుకుని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి, అంతర్లీనంగా ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Tags:    

Similar News