Drink Coffee Every Morning: ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీ తాగితే.. మీ లివర్‌కు కలిగే అద్భుతమైన లాభాలివే!

అద్భుతమైన లాభాలివే!

Update: 2026-08-04 04:36 GMT

Drink Coffee Every Morning: చాలా మందికి రోజు ఉదయాన్నే వేడివేడి కాఫీతో దినచర్యను ప్రారంభించడం అలవాటు. ఈ ఉత్సాహాన్నిచ్చే కాఫీ మన మనసుకే కాదు, మన కాలేయానికి (Liver) కూడా ఎంతో మేలు చేస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల లివర్‌కు కలిగే 4 ప్రధాన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ ముప్పు తగ్గింపు

కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తాయి. దీనివల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

లివర్ సిర్రోసిస్,క్యాన్సర్ నివారణ:

క్రమం తప్పకుండా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో లివర్ కణజాలం దెబ్బతినడం (Scarring/Cirrhosis) నెమ్మదిస్తుంది. అంతేకాకుండా, కాలేయ క్యాన్సర్ ముప్పును కూడా ఇది తగ్గిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి.

ఎన్‌జైమ్ స్థాయిల నియంత్రణ:

లివర్ ఆరోగ్య సరిగ్గా ఉందో లేదో తెలిపే ఎంజైమ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో కాఫీ సహాయపడుతుంది.

నాలుగవది, మంటను తగ్గించడం: కాఫీలో ఉండే సమ్మేళనాలు శరీరంలో,కాలేయంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ (మంట/వాపు)ను తగ్గించి, కణాలను రక్షిస్తాయి.

అయితే, ఇవన్నీ ఆరోగ్యకరమైన మోతాదులో, ఎలాంటి అదనపు కృత్రిమ చక్కెరలు లేదా ఎక్కువ క్రీమ్ కలపకుండా బ్లాక్ కాఫీ లేదా తక్కువ పాలు పోసుకుని తాగినప్పుడే సాధ్యమవుతాయి.

Tags:    

Similar News