First Time Applying Makeup: పెళ్లిళ్ల సీజన్ లేదా స్పెషల్ పార్టీలు.. ఏవైనా సరే ముస్తాబవ్వాలంటే మేకప్ ఉండాల్సిందే. అయితే చాలామందికి మొదటిసారి మేకప్ వేసుకోవడం ఒక పెద్ద టాస్క్ లా అనిపిస్తుంది. మీరు కూడా బిగినరేనా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే.

మొదటిసారి మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని మెలుకువలు పాటిస్తే ప్రొఫెషనల్ లుక్ మీ సొంతం అవుతుంది.అందులో మొదటి దశ.. చర్మాన్ని సిద్ధం చేయడం. మేకప్ వేసుకునే ముందే ముఖాన్ని క్లీన్ చేసుకొని మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రైమర్ రంధ్రాలను కవర్ చేసి, మేకప్ ఎక్కువ సేపు చెక్కుచెదరకుండా ఉండేలా కాపాడుతుంది. ఇక ఫౌండేషన్ లేదా బీబీ క్రీమ్ ఎంచుకునేటప్పుడు మీ స్కిన్ టోన్ కి సరిపోయేదాన్నే ఎంచుకోవాలి. ముఖానికి, మెడకు వేరియేషన్ కనిపించకుండా.. బ్యూటీ బ్లెండర్ సహాయంతో సమానంగా బ్లెండ్ చేయాలి. కంటి కింద నల్లటి వలయాలు ఉంటే కన్సీలర్‌తో వాటిని సులభంగా కవర్ చేయవచ్చు.

ఇక మేకప్‌లో హైలైట్ అంటే కళ్లే! కనుబొమలను ఐబ్రో పెన్సిల్‌తో తేలికగా షేప్ చేయాలి. సింపుల్‌గా ఐలైనర్, కాస్త మస్కారా అప్లై చేస్తే మీ కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. ఇక మేకప్‌కి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి.. టీ-జోన్ అంటే నుదురు, ముక్కు, గడ్డం వద్ద కాంపాక్ట్ లేదా లూజ్ పౌడర్‌ని లైట్‌గా అద్దాలి. ఇది జిడ్డుగా మారకుండా ఎక్కువ సేపు తాజాగా ఉండేలా చేస్తుంది. చెంపలపై సహజమైన లుక్ కోసం లైట్ బ్లష్, మీ డ్రెస్‌కి తగిన లిప్‌స్టిక్ లేదా గ్లాస్‌తో మీ మేకప్‌ని పూర్తి చేయండి. మొదటిసారే కదా అని కంగారు పడకుండా, ఇలా సింపుల్ స్టెప్స్ పాటిస్తే మీ అందం మరింత రెట్టింపు అవుతుంది.

Tags: