Gas Leak Emergency: గ్యాస్ లీకైనపుడు..వెంటనే ఏం చేయాలి..ఏం చేయకూడదు.?

వెంటనే ఏం చేయాలి..ఏం చేయకూడదు.?

Update: 2025-11-26 05:58 GMT

Gas Leak Emergency: గ్యాస్‌ సిలిండర్, స్టవ్‌ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. గ్యాస్ లీకైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యవసరం. ప్రాణనష్టం జరగకుండా, ఆస్తి నష్టం కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చర్యలు పాటించాలి

తక్షణమే చేయవలసిన ముఖ్యమైన చర్యలు

గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆపండి

వెంటనే గ్యాస్ సిలిండర్‌పై ఉన్న రెగ్యులేటర్‌ను/వాల్వ్‌ను ఆఫ్ చేయండి. ఇది లీక్ అవుతున్న వాయువు సరఫరాను ఆపుతుంది.

పైపులైన్ గ్యాస్ (PNG) అయితే, మీటర్ వద్ద ఉన్న మెయిన్ వాల్వ్‌ను మూసివేయండి.

కిటికీలు, తలుపులు తెరవండి

గ్యాస్ వాసన వచ్చిన వెంటనే, ఇంట్లోని అన్ని కిటికీలు ,తలుపులను తెరవండి. గ్యాస్ బయటకు పోయేలా వెంటిలేషన్‌ను పెంచండి.

ఇంటి నుంచి బయటకు వెళ్లండి

ముక్కు, నోరు తడిగా ఉన్న గుడ్డతో కప్పుకుని, సాధ్యమైనంత త్వరగా ఇల్లు లేదా ఆ ప్రాంతం నుంచి బయటకు, సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి.

అగ్నిమాపక దళానికి లేదా సరఫరాదారుకు కాల్ చేయండి

సురక్షితమైన దూరం నుంచి (ఇంటి బయట నుంచి) మాత్రమే అగ్నిమాపక దళం (101) లేదా మీ గ్యాస్ సరఫరాదారు ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి.

అస్సలు చేయకూడని పనులు

గ్యాస్ లీకైనప్పుడు చిన్నపాటి నిప్పు రవ్వ (Spark) కూడా పెద్ద పేలుడుకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ పనులు అస్సలు చేయవద్దు:

లైటర్/దీపం వెలిగించవద్దు: అగ్గిపుల్ల, లైటర్ లేదా కొవ్వొత్తిని అస్సలు వెలిగించవద్దు.

ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆపరేట్ చేయవద్దు: ఇంట్లో ఉన్న ఏ స్విచ్‌నూ ఆన్ చేయవద్దు, ఆఫ్ చేయవద్దు. స్విచ్‌లు ఆపరేట్ చేయడం వలన చిన్న స్పార్క్ వచ్చి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.

మొబైల్ ఫోన్ వాడొద్దు: ఇంటి లోపల మొబైల్ ఫోన్‌ను ఉపయోగించవద్దు (కాల్స్ చేయవద్దు, తీసుకోవద్దు). ఇది కూడా స్పార్క్‌ను సృష్టించవచ్చు.

ఎలక్ట్రానిక్ వస్తువులు ఆపరేట్ చేయవద్దు: ఫ్యాన్, ఎయిర్ కండీషనర్, ఫ్రిజ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ వంటివి అస్సలు ఆన్ చేయవద్దు లేదా ఆఫ్ చేయవద్దు.

మంటల వైపు వెళ్లొద్దు: ఒకవేళ చిన్న మంటలు చెలరేగితే, వాటిని సొంతంగా ఆర్పడానికి ప్రయత్నించవద్దు. వెంటనే బయటకు వెళ్లండి.

Tags:    

Similar News