Life Style: డియర్ కపుల్స్.. మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయండి!

మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయండి!

Update: 2026-01-01 05:06 GMT

Life Style: మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అయితే దంపతులు కచ్చితంగా ఈ ఒక్క పని చేయాలి. ఈ ఇయర్‌లో జరిగిన గొడవలు, చేదు అనుభవాలు, నచ్చని విషయాలు, ఇద్దరినీ ఇబ్బంది పెట్టిన క్షణాలను ఈ ఏడాదికే పరిమితం చేయండి. వాటిని కొత్త సంవత్సరానికి మోసుకెళ్లి మీ మధ్య దూరాన్ని మరింత పెంచుకోకండి. సమస్యలుంటే ఇవాళే కూర్చుని మాట్లాడుకోండి. డియర్ కపుల్స్.. కొత్త సంవత్సరాన్ని కొత్తగానే స్టార్ట్ చేయండి.

కొత్త ఏడాది మొదటి రోజున మనం చేసే పనులు ఆ ఏడాదంతా మనపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో గొడవలు, వాదనలకు దూరంగా ఉండాలని, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటున్నారు. ‘నలుపు దుస్తులు వద్దు. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. ఏడిచినా, విచారంగా ఉన్నా ఏడాదంతా అదే కొనసాగుతుంది’ అంటున్నారు.

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ రోజంతా నవ్వుతూ ఉండాలి. ఇంటిని శుభ్రం చేసి, గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులేసి, తోరణాలతో అలంకరించాలి. సాయంత్రం లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి, తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అన్నదానం, వస్త్రదానం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. నేడు సంతోషంగా జీవిస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

Tags:    

Similar News