Train Your Brain to Achieve Your Goals: మనం కోరుకున్నది సాధించాలి, మన లక్ష్యాలను 'మేనిఫెస్ట్' చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందరూ అనుకున్నది సాధించలేరు! ఎందుకంటే, మన కోరికలను కేవలం కలలు కనడం వేరు, వాటిని నిజం చేసుకునేలా మన మెదడును సిద్ధం చేయడం వేరు! మరి సక్సెస్ కోసం మన బ్రెయిన్‌ను ఎలా ట్రైన్ చేయాలో ఓ ప్రముఖ న్యూరోసర్జన్ అద్భుతమైన సలహా ఇస్తున్నారు.

ఆ డాక్టర్ చెబుతున్న ఆ ఒక్క ముఖ్యమైన అలవాటు.. 'ఇంటెన్షనల్ విజువలైజేషన్' (Intentional Visualization). అంటే, మనం ఏమైపోవాలనుకుంటున్నమో, మన లక్ష్యం నెరవేరినట్లు మన మెదడులో స్పష్టమైన చిత్రాలను రోజువారీగా ఊహించుకోవడం! సైన్స్ ప్రకారం దీన్ని 'న్యూరోప్లాస్టిసిటీ' అంటారు. అంటే మనం ఏ ఆలోచననైతే పదే పదే మన మెదడుకు పంపిస్తామో, మన మెదడు ఆచరణలో నిజంగా అదే జరుగుతున్నట్లు నమ్మి.. ఆ విజయం కోసం కావలసిన న్యూరల్ పాత్‌వేస్‌ను (Neural Pathways) అంటే నరాల మార్గాలను బలంగా నిర్మిస్తుంది.

అయితే కేవలం ఏదో ఊహించుకుని ఊరుకుంటే సరిపోదు! దీనిని ఆచరణలో పెట్టడానికి ఓ పద్ధతి ఉంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే లేదా రాత్రి పడుకునే ముందు.. కేవలం ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని, మీ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లుగా మీ మనసులో ఊహించుకోండి. ఆ సమయంలో మీకు కలిగే సంతోషాన్ని, ఆ ఉత్సాహాన్ని నిజంగా అనుభవించండి. అలా చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ (Subconscious Mind) చురుగ్గా మారి, ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి కావలసిన పనులను చేయడానికి మిమ్మల్ని అడుగుల ముందుకు వేయిస్తుంది.

Tags: