Bathe While the Washing Machine Is On: వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానం చేయొద్దా.?

ఆన్ చేసి స్నానం చేయొద్దా.?

Update: 2026-04-06 09:00 GMT

Bathe While the Washing Machine Is On: మనం రోజూ వాడే గృహోపకరణాల్లో వాషింగ్ మెషీన్ ఒకటి. పనిని సులభతరం చేసే ఈ యంత్రం విషయంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా? చాలామంది వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసి, అది రన్ అవుతుండగానే బాత్‌రూమ్‌లోకి వెళ్లి స్నానం చేస్తూ ఉంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమని ఎలక్ట్రీషియన్లు , నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ లీకేజీ వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు లోపల మోటార్ వేగంగా తిరుగుతుంది. మెషీన్ పాతదైనా లేదా వైరింగ్‌లో చిన్న లోపం ఉన్నా.. ఆ విద్యుత్ మెషీన్ బాడీకి తద్వారా అక్కడ ఉన్న నీటి ప్రవాహానికి సోకే ప్రమాదం ఉంది. నీరు విద్యుత్ వాహకం కాబట్టి, ఆ షాక్ నేరుగా బాత్‌రూమ్‌లో ఉన్న వ్యక్తికి తగులుతుంది.

వైబ్రేషన్ , ప్రెజర్. మెషీన్ బట్టలను పిండేటప్పుడు (Spinning) తీవ్రమైన వైబ్రేషన్ వస్తుంది. ఈ ఒత్తిడి వల్ల లోపల ఉండే వైరింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. అలా తెగిపోయిన వైర్లు తడి ప్రాంతానికి తగిలినా.. లేదా మెషీన్ నుంచి లీక్ అయ్యే నీటికి తగిలినా ప్రమాదం పొంచి ఉంటుంది.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా ఇళ్లలో వాషింగ్ మెషీన్ వాటర్ అవుట్‌లెట్ పైప్ , బాత్‌రూమ్ షవర్ లేదా సింక్ వేస్టేజ్ పైప్ ఒకే డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటాయి. దీనివల్ల విద్యుత్ ప్రవాహం నీటి ద్వారా షవర్ వరకు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు బాత్‌రూమ్‌లోకి వెళ్లకపోవడమే ఉత్తమం. మెషీన్ తన పని పూర్తి చేసిన తర్వాత, మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి.. ప్లగ్ తొలగించాలి. ఆ తర్వాత వెంటనే కాకుండా, కనీసం 30 నుంచి 40 నిమిషాల తర్వాత స్నానం చేయడం సురక్షితం. ఈ గ్యాప్‌లో మెషీన్ చుట్టూ ఉన్న తేమ తగ్గిపోతుంది, నిలిచి ఉన్న విద్యుత్ ప్రవాహం (Static Charge) ఉంటే అది తొలగిపోతుంది.

Tags:    

Similar News