‘Exercise Snacks’: రోజంతా గంటల తరబడి కుర్చీల్లో కూర్చుంటున్నారా? జిమ్‌కి వెళ్లడానికి అసలు సమయం దొరకట్లేదా? అయితే మీకోసమే ఈ అద్భుతమైన ఫిట్‌నెస్ చిట్కా! బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామం చేయలేకపోతున్నామని బాధపడేవారికి.. ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ డ్యాన్ గో ఓ సరికొత్త ఐడియాను ముందుకు తెచ్చారు. అదే 'ఎక్సర్‌సైజ్ స్నాక్స్

అసలు ఈ 'ఎక్సర్‌సైజ్ స్నాక్స్' అంటే ఏంటో తెలుసా? మనం తినే చిరుతిళ్ల లాగే.. వ్యాయామాన్ని కూడా చిన్న చిన్న విరామాల్లో, రోజంతా విడదీసి చేయడం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 నుంచి 85 శాతం మంది ప్రజలు గంటల తరబడి కదలకుండా కూర్చునే జీవనశైలిని అనుసరిస్తున్నారని డ్యాన్ గో ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. దీన్ని తరిమికొట్టేందుకు గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చాల్సిన పనిలేదు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కేవలం ఐదు నిమిషాల పాటు చిన్నపాటి వాకింగ్ చేస్తే సరిపోతుంది! ఇలా రోజంతా చిన్న చిన్న మూవ్‌మెంట్స్ చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన యాక్టివిటీ అందుతుంది.

దీనికోసం ప్రత్యేకంగా జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఖరీదైన పరికరాలు అసలే అక్కర్లేదు. మన దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.ఉదాహరణకు, మీరు వెళ్లే చోట కారును కాస్త దూరంగా పార్క్ చేసి నడవండి. లిఫ్ట్‌లకు బదులుగా వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కడానికి ప్రాధాన్యత ఇవ్వండి. డెస్క్ దగ్గరే ఎక్కువ సమయం గడిపేవారు వాకింగ్ ట్రెడ్‌మిల్స్ వంటివి ఉపయోగించవచ్చు. గంటల తరబడి వ్యాయామం చేయాలనే ఆలోచనను పక్కన పెట్టండి. ఇలా రోజంతా చిన్నపాటి 'ఎక్సర్‌సైజ్ స్నాక్స్' తీసుకోవడం ద్వారా మీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవచ్చు,

Tags: