Curd: బరువు తగ్గాలని, స్లిమ్మ్‌గా మారాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దానికోసం కొంతమంది అసలు సరిగ్గా తినకపోతే, మరికొందరు కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. కానీ అలా చేస్తే బరువు తగ్గడం దేవుడెరుగు.. ఆరోగ్యం మాత్రం పూర్తిగా దెబ్బతింటుంది! ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా.. పోషకాలు ఉన్నవి కొద్ది మొత్తంలో తినడం ఎప్పుడూ మంచిదే. ముఖ్యంగా, అధిక బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆహారం.. పెరుగు!

పెరుగు తింటే స్థూలకాయం వస్తుందని, లావవుతామని చాలా మంది ఇప్పటికీ అపోహపడుతుంటారు. కానీ అది పూర్తిగా పొరపాటని ఎన్నో సైంటిఫిక్ స్టడీస్‌లో తేలింది! ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకుంటే బరువు తగ్గే ప్రయాణం చాలా సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగులో ఉండే క్యాల్షియం.. శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించి మిమ్మల్ని స్లిమ్మ్‌గా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు, దీనిలోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను పుష్కలంగా అందిస్తాయి.

అంతేకాకుండా, పెరుగును తరచూ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మధ్యమధ్యలో చిరుతిళ్లు, జంక్‌ఫుడ్ తినాలనే కోరిక దూరం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.కాబట్టి కడుపు మాడ్చుకోకుండా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే.. ప్రతిరోజూ మీ డైట్‌లో ఒక కప్పు పెరుగును తప్పకుండా భాగం చేసుకోండి.

Tags: