Over 40: 40 ఏళ్లు దాటిన వారు.. మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి!

ఈ మార్పులు చేసుకోండి!

Update: 2026-07-14 08:17 GMT

Over 40: ఏం చేతనైతలేదు సార్.. ఏ చిన్న పనిచేసినా ఒళ్లంతా అలసటగా అనిపిస్తోంది’.. ఈ మధ్యకాలంలో నడివయసు దాటిన వారు డాక్టర్ల దగ్గరకు వెళ్లినప్పుడు చెప్పే మొదటి సమస్య ఇదే! అసలు నలభై ఏళ్లు దాటకముందే శరీరం ఎందుకు ఇంతలా బలహీనపడిపోతోంది? వయసు పెరిగినా సరే.. ఎనర్జీ తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ సీక్రెట్స్ పాటించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని క్రైటన్ (Creighton) యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం.. ఈ తరం జనరేషన్‌లో నలభై ఏళ్లు దాటిన తర్వాత నుంచే శారీరక బలహీనత మొదలవుతోంది. దీనికి బాధ్యతలు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం. అయితే అన్నింటికంటే ముఖ్యమైన కారణం.. బలం లేని ఆహారం!

నడివయసులో కూడా ఎనర్జీ లెవెల్స్ సూపర్బ్ గా ఉండాలంటే.. ముందుగా కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అన్‌హెల్దీ హ్యాబిట్స్‌ను పూర్తిగా పక్కన పెట్టేయాలి.

ఇక డైట్ విషయానికి వస్తే.. వైద్యులు సూచిస్తున్న బెస్ట్ సీక్రెట్ ‘స్లో కార్బ్స్’ (Slow Carbs). మన మెదడుకు, కండరాలకు శక్తిని ఇచ్చేవి కార్బోహైడ్రేట్లే అయినప్పటికీ.. వయసు పెరిగే కొద్దీ వాటిని అరిగించుకునే శక్తి శరీరానికి తగ్గుతుంది. అందుకే రక్తంలోకి గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేసే ముడి ధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు మరియు చిక్కుడు జాతి గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

వయసు పైబడిన వారు జంక్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రిఫైన్డ్ ఫుడ్స్, వైట్ రైస్, స్వీట్స్ ఎక్కువగా తింటే.. ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి పడి బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఫలితంగా శరీరం త్వరగా అలసిపోతుంది. కాబట్టి, నడివయసులోనూ నవనవలాడాలన్నా.. నిత్య యవ్వనంగా ఉత్సాహంగా ఉండాలన్నా.. ఈ డైట్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే!"

Tags:    

Similar News