Shouting at Kids in Public Places: పబ్లిక్ ప్లేసుల్లో పిల్లలపై అరుస్తున్నారా.?

పిల్లలపై అరుస్తున్నారా.?

Update: 2026-04-03 02:33 GMT

Shouting at Kids in Public Places: పిల్లలు కన్నవారికి ప్రతిబింబాలు. మనం ఏం చేస్తే వారు అదే నేర్చుకుంటారు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో పిల్లలతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అన్నది వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్టులు హెచ్చరిస్తున్నారు.

తల్లిదండ్రులను చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. మనం పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులతో మర్యాదగా, గౌరవంగా మాట్లాడితే.. ఎదుటివారి పట్ల దయతో వ్యవహరిస్తే, పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. ఇలా చేయడం వల్ల వారిలో మంచి నడవడికతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

కానీ దీనికి విరుద్ధంగా.. మనం పదిమందిలో ఇతరులపై అరవడం, తిట్టడం లేదా అసభ్యంగా మాట్లాడటం వంటివి చేస్తే, ఆ ప్రభావం పిల్లల మనసుపై బలంగా పడుతుంది. చిన్న వయసులో చూసిన ఈ నెగెటివ్ ప్రవర్తన వల్ల, భవిష్యత్తులో వారు కూడా అదే విధంగా ప్రవర్తించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే మీ పిల్లలకు మీరు ఇచ్చే అతిపెద్ద ఆస్తి మంచి ప్రవర్తన. పబ్లిక్ ప్లేసుల్లో మీరు చూపే సంస్కారమే వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి, పిల్లల ముందు ప్రవర్తించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.

Tags:    

Similar News