Start Your Day Right: ఉదయాన్నే పరిగడుపున.. ఈ మూడు పదార్థాలు తప్పక తీసుకోండి.!

ఈ మూడు పదార్థాలు తప్పక తీసుకోండి.!

Update: 2026-08-04 04:38 GMT

Start Your Day Right: మనం ఉదయాన్నే నిద్రలేచాక పరగడుపున తీసుకునే మొదటి ఆహారం మన రోజంతా ఉండే శక్తిని, జీర్ణవ్యవస్థ పనితీరును నిర్ణయిస్తుంది. అందుకే ఉదయం పూట ఏది పడితే అది తినకుండా ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

తాజాగా ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్ తాను ఉదయం 6 గంటలకు పరగడుపున తీసుకునే మూడు ధానాంశాలను పంచుకున్నారు.

మొదటిది, హైడ్రేషన్! శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల రాత్రంతా నిద్రావస్థలో ఉన్న జీర్ణవ్యవస్థ యాక్టివ్ అవుతుంది.

రెండవది, హెల్దీ ఫ్యాట్స్ లేదా యాంటీ ఆక్సిడెంట్లు ఉండే డ్రై ఫ్రూట్స్! నానబెట్టిన బాదం లేదా వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది మరియు తక్షణ శక్తి అందుతుంది.

మూడవది, గట్ హెల్త్ (జీర్ణక్రియ) మెరుగుపరిచేందుకు నిమ్మరసం కలిపిన నీరు లేదా హెర్బల్ టీ వంటివి తీసుకోవడం. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, జీవక్రియను (Metabolism) వేగవంతం చేస్తాయి.

ఉదయాన్నే ఈ చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు, బరువు నియంత్రణలో ఉంటుంది.

Tags:    

Similar News