Lose Weight During the Monsoon: వర్షాలు కురుస్తున్నాయంటే చాలు.. వేడి వేడి చాయ్, గుమగుమలాడే పకోడీలు, సమోసాలు లాగించేయాలని మనసు లాగుతుంది! కానీ ఇవన్నీ తింటే బరువు పెరిగిపోతామేమోనని టెన్షన్ పడుతుంటాం. అయితే, మనకు ఇష్టమైన వర్షాకాలపు పిండి వంటలను మానుకోకుండానే, కొన్ని స్మార్ట్ చిట్కాలతో బరువును అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అవేంటంటే.. మొదటిది.. డీప్ ఫ్రై చేసిన పకోడీలకు బదులుగా ఎయిర్-ఫ్రైడ్ పకోడీలను ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా శనగపిండి పైపొర చక్కగా కరకరలాడుతుంది, పైగా నూనె శాతం చాలా వరకు తగ్గుతుంది.

ఇక రెండోది.. మన అందరికీ ఇష్టమైన వడపావ్! నూనెలో వేయించిన వడకు బదులుగా బేక్ చేసిన వడను, సైజులో చిన్నగా ఉండే పావ్‌ను ఎంచుకుంటే సరి.మూడోది.. వర్షాకాలంలో రోజూ తాగే టీ విషయంలో జాగ్రత్త! సాయంత్రం వేళల్లో అదనంగా తాగే టీ కప్పులతో పాటు తినే బిస్కట్లు, స్నాక్స్ రూపంలో క్యాలరీలు సైలెంట్‌గా పెరుగుతాయి. అందుకే టీని రోజుకు రెండు కప్పులకు పరిమితం చేసి, అనవసరమైన స్నాక్స్ మానేయండి.

నాలుగోది.. చాలామందికి ఇష్టమైన మ్యాగీ! వర్షంలో వేడి వేడి మ్యాగీ తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుంటుంది. అలా కాకుండా మ్యాగీలో ఉడకబెట్టిన గుడ్డు, కొన్ని కూరగాయలు లేదా కొద్దిగా పన్నీర్ కలుపుకుంటే అది ఓ పర్ఫెక్ట్ హెల్దీ మీల్‌గా మారిపోతుంది.ఐదోది.. సమోసాలను పూర్తిగా మానేయక్కర్లేదు! కానీ ఇంట్లోనే కొంచెం చిన్న సైజులో, మైదా పొర పల్చగా ఉండేలా చేసుకొని తినండి.ఇక ఆరోది.. వర్షాకాలంలో ఎంతో ఇష్టంగా తినే మొక్కజొన్న పొత్తు! దానికి విపరీతంగా బటర్ రాయడానికి బదులుగా, కేవలం నిమ్మకాయ, ఉప్పు, కారం రాసి కాల్చుకుంటే ఆ టేస్టే వేరు.ఇక బయట ఎక్కడైనా నూనె పదార్థాలు కొంటే.. తినేముందు ఒక టిష్యూ పేపర్‌తో అదనపు నూనెను తుడిచేయడం మంచిది.

Tags: