ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణికి కాన్పు

Collector's wife gives birth at Palvancha Government Hospital

Update: 2025-05-28 08:01 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి కాన్పు జరిగింది. పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సతీమణి శ్రద్ద మొదటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలొనే పరీక్షలు చేయించుకుంటున్నారు. కలెక్టర్ దంపతులకు మొదట బిడ్డ కాగా తాజా కాన్పులో కూడా అబ్బాయి పుట్టాడు.

ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ దంపతుల చొరవ అభినందనీయమని స్థానికులు అభినందిస్తున్నారు. జిల్లా ప్రధాన అధికారిగా ఉండే కలెక్టర్ చర్యతో  ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరుగుతుందని వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News