Donald Trump Claims: పాక్-అఫ్గాన్ యుద్ధం ఆపడం సులభమే: డొనాల్డ్ ట్రంప్

యుద్ధం ఆపడం సులభమే: డొనాల్డ్ ట్రంప్

Update: 2025-10-18 11:59 GMT

Donald Trump Claims: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన డోస్‌ను మరింత పెంచారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా సులభమైన పని అని ప్రకటించారు. ఇప్పటి వరకు తాను ఎనిమిది దేశాల మధ్య యుద్ధాలను ఆపానని, ఈ యుద్ధం తొమ్మిదవదిగా ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపాను. పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనుకుంటే అది నాకు చాలా సులభం. దేశాన్ని నడపాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, యుద్ధాలు ఆపడం నాకు ఎంతో ఇష్టం. రువాండా-కాంగో యుద్ధం గానీ, ఇండియా-పాకిస్తాన్ యుద్ధం గానీ... ప్రతీసారి యుద్ధం ఆపినపుడు 'మీకు నోబెల్ ప్రైజ్ వస్తుంది' అని అంటారు. కానీ, నాకు రావడం లేదు. నేను మనుషుల ప్రాణాలు కాపాడటం కోసమే యుద్ధాలు ఆపుతున్నాను. ఈ యుద్ధం తొమ్మిదవది అవుతుంది. ఇంతవరకు ఏ అధ్యక్షుడూ ఇలా యుద్ధాలు ఆపలేదు. జార్జ్ బుష్ ఒక యుద్ధం మాత్రమే చేశారు, కానీ నేను మిలియన్ల మంది ప్రాణాలు కాపాడాను" అని ట్రంప్ వివరించారు.

ఇండియా-పాకిస్తాన్ యుద్ధం గురించి ట్రంప్ తరచూ మాట్లాడుతుండగా, ఇండియా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తోంది. ట్రంప్ కారణంగా యుద్ధం ఆగలేదని స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News