Big Beautiful bill : బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం

బిల్లు ఆమోదంతో డోనాల్డ్‌ ట్రంప్‌ కల సాకారం;

Update: 2025-07-04 04:49 GMT

మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నది సాదించారు. ట్రంప్‌ కలలుకన్న బిగ్‌ బ్యూటీఫుల్‌ కు బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అమెరికన్‌ కాంగ్రెస్‌ సభలో ట్రంప్‌ ప్రవేశపెట్టిన బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లుకు అనుకూలంగా 213 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగు ఓట్ల ఆధిక్యంతో ఈ బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు ఆమోదం పొందడంతో ట్రంప్‌ కన్న కలలు సాకరమైనట్లు అయ్యింది. గురువారం అమెరికా ప్రతినిధుల సభలో బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌ లో బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించడం గమనార్హం. అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదానికి ముందు బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లుకు అమెరికన్‌ సెనెట్‌లో కూడా ఆమోదం లభించింది. తాజాగా కాంగ్రెస్‌ లో కూడా బిగ్‌ బ్యూటీ ఫుల్‌ బిల్లుకు ఆమోదం లభించడంతో ఇక అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేయడంతో ఈ బిల్లు చట్టంగా మారుతుంది. వ్యయ నియంత్రణ, పన్నుల్లో కోత లక్ష్యంగా ట్రంప్‌ ఈ బిల్లును రూపొందించి అమెరికా అత్యున్నత చట్టసభల్లో ఆమోదింప చేసుకున్నారు. అమెరికా కాంగ్రెస్‌ లో ఈ బిల్లు ఆమోదం పొందడం అనేది ట్రంప్‌ సాధించిన అతి పెద్ద విజయంగా ఆయన మద్దతు దారులు చెపుతున్నారు.

గ్రీన్‌ ఎనర్జీ పథకాల్లో మార్పులు, మెడికల్‌ ఎయిడ్‌ ఖర్చుల్లో భారీ కోతలు, వలసలు నియంత్రించడం, సరిహద్దు భద్రత విషయంలో భారీగా నిధులు కేటాయించడం, పన్నుల తగ్గింపు వంటి అనేక అంశాలు ఈ బిల్లులో పొందుపరచబడి ఉన్నాయి. దీంతో ఈ బిల్లును ట్రంప్‌ మిత్రుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా సెనెట్‌ లో బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రతినిధుల సభైన కాంగ్రెస్‌ లో ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే నేను ఆ మర్నాడే రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఇప్పుడు గురువారం బిగ్‌ బ్యూటీఫుల్ బిల్లు ఆమోదం పొందడంతో ఎలాన్‌ మస్క్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో అని ఆమెరికన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News