జపాన్ తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం…
కీలక ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్;
మొత్తానికి జపాన్ దేశాన్ని ఆమెరికా దారిలోకి తెచ్చుకుంది. ఓ రకంగా బెదిరించి మరీ జపాన్ తమ దేశంతో భారీ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేశారు. ఈ మేరకు టోక్యో అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. తమతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామని గతంలో ట్రంప్ జపాన్ దేశానని హెచ్చరించారు. తాజా ఒప్పందం ప్రకారం జపాన్ పై అమెరికా 15 శాతం మాత్రమే సుంకం విధిస్తుందని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంపై ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, జపాన్ దేశాలు పరస్పరం 15 శాతం రేటుతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం జపాన్ 550 బిలియన్ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. దీని వల్ల జపాన్ దేశం 90 శాతం లాభాలను పొందుతుందని ట్రంప్ తెలిపారు. జపాన్ దేశం ఇప్పటి వరకూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల్లో ఇదే అతి పెద్ద ఒప్పందమని ట్రంప్ ప్రకటించారు. తమ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా లక్షలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయని ట్రంప్ చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు, బియ్యం, కారులు, ట్రక్కులు వంటి వస్తువుల వాణిజ్యానికి గుట్లు తెరుచుకుంటాయని ట్రంప్ వివరించారు.