కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఆంధ్రప్రదేశ్‌ వాసి నియమితులయ్యారు. రాజస్తాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఏటూరు భాను ప్రకాష్‌ రెడ్డి తాజాగా డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియాగా నియామకమయ్యారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుకూరు గ్రామానికి చెందిన భాను ప్రకాష్‌రెడ్డి 2003 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంతకాలం పని చేశారు. 2018 నుంచి 2021 వరకు డిప్యుటేషన్‌పై ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యదర్శిగా పనిచేశారు. ఏటూరు భాను ప్రకాష్‌ రెడ్డి డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగుతారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పని చేయడం ఇదే ప్రథమం.



Tags: