Arvind Kejriwal: ఈ20 పెట్రోల్‌పై వినియోగదారులకు ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్
కేజ్రీవాల్
Arvind Kejriwal: పెట్రోల్ బంకుల్లో ఈ20 మిశ్రమ ఇంధనం లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం వినియోగదారులకు కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ20 పెట్రోల్ ధరలను తగ్గించాలని కూడా కోరారు.
దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మిశ్రమ ఇంధనానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాలు అందించేందుకు ఆగస్టు 4న ప్రధాని నివాసం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం ఈ20 ఇంధనాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ఆరోపించిన కేజ్రీవాల్, దీని వల్ల ఇథనాల్ దిగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ20 ఇంధనం వాహనాలకు నష్టం కలిగించదని ప్రభుత్వం చెబుతున్న అధ్యయన నివేదికలను బహిరంగపరచాలని కూడా డిమాండ్ చేశారు.