CM Vijay Meets Stalin: ఖజానా ఖాళీ ఆరోపణల నేపథ్యంలో.. స్టాలిన్‌ను కలిసిన సీఎం విజయ్

స్టాలిన్‌ను కలిసిన సీఎం విజయ్

Update: 2026-05-11 13:09 GMT

CM Vijay Meets Stalin: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీవీకే అధినేత విజయ్ స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ భేటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వదిలేసిందని సీఎం విజయ్ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి స్టాలిన్ స్పందించి, అప్పులు పరిమితుల్లోనే ఉన్నాయని, కోవిడ్ వంటి విపత్తులను ఎదుర్కొని, కేంద్రం (భాజపా) నుంచి వచ్చిన అడ్డంకులను తట్టుకుని ప్రభుత్వం నడిపించామని వివరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది. టీవీకే నేతృత్వంలో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం విజయ్ స్టాలిన్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 13న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సమావేశం సంకేతాలను ఇస్తోంది.

Tags:    

Similar News