Trinamool Congress (TMC): మమతా బెనర్జీకి మరో గట్టి షాక్: టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా

చంద్రిమా భట్టాచార్య రాజీనామా

Update: 2026-07-04 12:15 GMT

Trinamool Congress (TMC): తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని సీనియర్ నేత చంద్రిమా భట్టాచార్య శనివారం రాష్ట్ర అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా, పార్టీలో తనకు కేటాయించిన అన్ని పదవులకు కూడా ఆమె రాజీనామా విరమించారు.

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత మమతా బెనర్జీ పార్టీని పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జూన్ మొదటి వారంలో చంద్రిమా భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. అయితే, పదవి చేపట్టిన కేవలం నెల రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

పార్టీలో ఆధిపత్య పోరు ముదిరిన నేపథ్యంలో ఈ రాజీనామా మమతా బెనర్జీకి మరో భారీ దెబ్బగా మారింది. బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం ఇటీవల కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని, తమదే అసలైన టీఎంసీ అని ప్రకటించింది. ఈ సమావేశంలో ఫిర్హాద్ హకీమ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అఖ్రూజమాన్ వంటి నేతలు పాల్గొన్నారు.

పార్టీ నుంచి కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో టీఎంసీలో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. చంద్రిమా భట్టాచార్య రాజీనామా ఎందుకు చేశారనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News