BJP Registers a Massive Victory in Thiruvananthapuram Corporation: తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ ఘన విజయం.. 45 ఏళ్ల కామ్రేడ్ల కోటకు చిల్లు!

45 ఏళ్ల కామ్రేడ్ల కోటకు చిల్లు!

Update: 2025-12-13 14:00 GMT

BJP Registers a Massive Victory in Thiruvananthapuram Corporation: కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్యంలోని ఎన్‌డీఏ ఘన విజయం సాధించింది. అధికార ఎల్‌డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్), ప్రతిపక్ష యూడీఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్)లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 101 వార్డుల్లో బీజేపీ 50 సీట్లను కైవసం చేసుకోగా, ఎల్‌డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

2020 ఎన్నికలతో పోలిస్తే ఈ ఫలితాలు బీజేపీకి భారీ బూస్ట్ ఇచ్చాయి. అప్పట్లో ఎల్‌డీఎఫ్ 52 సీట్లు, ఎన్‌డీఏ 33, యూడీఎఫ్ కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకున్నాయి. ఇప్పుడు బీజేపీ ఒంటరిగా అతిపెద్ద పార్టీగా అవతరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విజయం బీజేపీకి కీలక ఊపునిస్తోంది. సుమారు 45 ఏళ్లుగా కమ్యూనిస్టుల బలమైన కోటగా పేరొందిన తిరువనంతపురంలో కాషాయ జెండా రెపరెపలాడటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

Tags:    

Similar News