CM Vijay: డ్రగ్స్‌ నిర్మూలనకు సీఎం విజయ్‌ పరుగు

సీఎం విజయ్‌ పరుగు

Update: 2026-06-26 15:08 GMT

CM Vijay: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ డ్రగ్స్‌ వ్యతిరేక మారథాన్‌లో పాల్గొన్నారు. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో సీఎం విజయ్‌ 6 కిలోమీటర్ల మేర పరుగెత్తారు.

ఈ సందర్భంగా మంత్రులు, వాలంటీర్లు, వేలాది ఔత్సాహికులు పాల్గొన్నారు. మారథాన్‌ ప్రారంభానికి ముందు సీఎం విజయ్‌ పాల్గొన్నవారందరితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

యువతను ఉద్దేశించి సీఎం విజయ్‌ మాట్లాడుతూ, “డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ రన్నింగ్‌ చేయాలి. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలియజేయాలి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించడానికి అనేక ప్రాంతాల్లో మారథాన్‌లు, మినీ మారథాన్‌లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమం యువత మధ్య డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాన్ని సమర్థవంతంగా అందించడంలో కీలకమైనదిగా మారనుంది.

Tags:    

Similar News