ED Raids: ఈడీ దాడులు: ఆప్ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిత్తల్ ఇంటి సహా వ్యాపార సంస్థలపై సోదాలు

అశోక్ మిత్తల్ ఇంటి సహా వ్యాపార సంస్థలపై సోదాలు

Update: 2026-04-15 10:59 GMT

ED Raids: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిత్తల్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. అశోక్ మిత్తల్ నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు వ్యాపార సంస్థల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సోదాల వివరాలను త్వరలో వివరణాత్మక ప్రకటన ద్వారా బయటపెడతామని ఈడీ అధికారులు తెలిపారు.

వ్యాపారవేత్త, విద్యావేత్త అయిన అశోక్ కుమార్ మిత్తల్ లవ్లీ గ్రూప్‌కు అధిపతిగా ఉన్నారు. ఈ గ్రూప్ ఒక యూనివర్సిటీని నడుపుతోంది.

ఇటీవల ఆప్ పార్టీ రాజ్యసభలో తన ఉపనేత స్థానం నుంచి ఎంపీ రాఘవ్ చద్దాను తొలగించి, ఆ స్థానంలో పంజాబ్‌కు చెందిన అశోక్ మిత్తల్‌ను నియమించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తడానికి రాఘవ్ చద్దా భయపడుతున్నాడనే కారణంతో ఈ మార్పు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ నియామకం జరిగిన కొద్ది రోజుల్లోనే అశోక్ మిత్తల్ నివాసంపై ఈడీ సోదాలు జరగడం గమనార్హం.

Tags:    

Similar News